Smriti Mandhana: RCBకి స్మృతి మంధాన గుడ్‌బై?
ABN , Publish Date - Nov 01 , 2025 | 02:41 PM
కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. కానీ..
క్రీడా వార్తలు: టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana RCB) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన ఆటతో దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్మృతి కెప్టెన్ గా ఉంది. ఈక్రమంలోనే ఆమె ఆర్సీబీ జట్టును వీడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ షేర్ చేసిన పోస్ట్ ఈ అనుమానాలకు కారణమైంది.
శనివారం(నవంబర్ 1) కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్, శ్రేయాంక పాటిల్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జితేష్ శర్మ కన్నడ ప్రజలకు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల జట్టు నుంచి శ్రేయాంక పాటిల్ మాత్రమే విషెస్ చెప్పారు. కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana leaving RCB) చెప్పకపోవడంతో ఆమె జట్టును వీడుతుందనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.
స్మృతి మంధాన(Smriti Mandhana) ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీతో బిజీగా ఉంది. అందుకే ఆమె ఆర్సీబీ ఫ్రాంచైజీకి అందుబాటులోకి రాలేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. స్మృతి మంధానతో పాటు మరే ఇతర ఆర్సీబీ మహిళా క్రికెటర్(RCB women team ) కూడా ఈ వీడియోలో కనిపించలేదని, ప్రధాన ప్లేయర్లు వరల్డ్ కప్ లో ఆడుతున్నారని బెంగళూరు జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గాయంతో భారత జట్టుకు దూరమైన శ్రేయాంక పాటిల్ ..కాస్తా ఫ్రీగా ఉండటంతోనే ఈ వీడియో చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీకి కోహ్లీ ఎంతనో.. స్మృతి మంధాన కూడా అంతేనని, ఆమె ఎప్పుడూ ఈ జట్టుతోనే ఉంటుందని ఆర్సీబీ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి