Share News

Shubman Gill: ఐసీయూలో గిల్?

ABN , Publish Date - Nov 16 , 2025 | 06:53 AM

సౌతాఫ్రికాతో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Shubman Gill: ఐసీయూలో గిల్?
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అది తీవ్రం కావడంతో గిల్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.


మెడ కండరాలు పట్టేయంతో బ్యాటింగ్ సందర్భంగా గిల్(Shubman Gill) తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కేవలం మూడే బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేశాడు. మెడ పట్టేయంతో మైదానాన్ని వీడాడు. అయితే గిల్ ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజూరీ అయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నట్టుండి కెప్టెన్ గిల్ మైదానాన్ని వీడటంతో అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


నిద్రలేమి వల్లే..

ఈ విషయంపై బీసీసీఐ(BCCI) ఇప్పటికే స్పందించిన తెలిసిందే. మెడ పట్టేయంతో ఆసుపత్రికికి తరలించామని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తుందని తెలిపింది. మరోవైపు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా గిల్ గాయంపై మాట్లాడాడు. నిద్ర లేమి వల్లే మెడ కండరాలు పట్టేశాయని, గిల్ త్వరలోనే రికవరీ అవుతాడని తెలిపాడు. కాగా ఈ తీవ్ర గాయంతో గిల్ కోల్‌కతా టెస్టుకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?

ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 06:53 AM