WCL 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. శిఖర్ ధావన్ సూటి సమాధానం
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:16 AM
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్‌ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 రెండో ఎడిషన్‌లో ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఉంది. అయితే, ఈ లీగ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడకుడదా అని ప్రశ్నించగా..
ఈ క్రమంలోనే WCL 2025 మ్యాచ్ రద్దు తర్వాత, పాకిస్తాన్ ఆటగాళ్లు ధావన్.. నిర్ణయాన్ని ప్రభావితం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇండియా ఛాంపియన్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ సెమీ-ఫైనల్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుడదా అని ప్రశ్నించగా, ధావన్ సూటిగా సమాధానం ఇచ్చాడు. బాయ్ ఒత్తిడిలో నేను నా మాట మారుస్తానని అనుకుంటే, అది జరగదు. గతంలో నేను ఆడలేదు, ఇప్పుడూ కూడా ఆడనని పేర్కొన్నాడు.
పేలవ ప్రదర్శన
శిఖర్ ధావన్ సమాధానం అతడి స్పష్టతను, ఒత్తిడిలో కూడా సంయమనాన్ని చాటింది. అయితే, ఈ టోర్నమెంట్‌లో ఇండియా ఛాంపియన్స్ పేలవ ప్రదర్శన అభిమానులను నిరాశపరిచింది. ఒక్క విజయం కూడా సాధించలేకపోవడం జట్టు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ఈ లీగ్‌లో బలంగా కనిపిస్తుంది.
సీనియర్ ఆటగాళ్లు..
ఇండియా ఛాంపియన్స్ జట్టు ఈ టోర్నమెంట్‌లో తమ సత్తా చాటాలంటే, శిఖర్ ధావన్ వంటి సీనియర్ ఆటగాళ్లు రాణించాలి. ధావన్ బ్యాటింగ్‌లో దూకుడు, ఫీల్డింగ్‌లో చురుకుదనం జట్టుకు చాలా కీలకం. అయితే, జట్టు నిర్ణయాలు, మ్యాచ్ రద్దుల వంటి వివాదాలు ఆటగాళ్ల దృష్టిని మరల్చకుండా ఉంటేనే విజయం సాధ్యమని పలువురు అంటున్నారు. రాబోయే మ్యాచ్‌లలో ఇండియా ఛాంపియన్స్ తమ నైపుణ్యాన్ని చూపించి గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆసియా కప్‌లో మాత్రం..
ఇక ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లపై అందరి దృష్టి ఉంది. BCCI ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు ఆడతాయని ధృవీకరించింది. రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో, టోర్నమెంట్‌లో మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు అభిమానులకు ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించనున్నాయి. గతంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎంత ఆసక్తికరంగా జరిగాయో తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి