Forest Jobs: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:04 AM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్ట్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (AP Forest Section Officer Recruitment) ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్ట్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష, శారీరక పరీక్ష, సీపీటీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి బోనస్ మార్కులు ఉంటాయి.
పోస్టు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఓ). మొత్తం 100 పోస్టులు ఉన్నాయి.
వయస్సు: 2025 జూలై 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ ఉండాలి. (బోటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్)
శారీరక ప్రమాణాలు:
పురుషులు: కనీసం 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతి 84 సెంటీ మీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
స్త్రీలు: కనీసం 150 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతి 79 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీ మీటర్లు పెరగాలి.
నడక: పురుషులు నాలుగు గంటల్లో 25 కిలో మీటర్లు నడవాలి. మహిళలు 16 కిలో మీటర్లు నడవాలి.
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 17
వెబ్‌సైట్: portalpsc.ap.gov.in/
ఈ వార్తలు కూడా చదవండి
అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
For More Educational News And Telugu News