Train Accident: పట్టాలు తప్పి అడవుల్లోకి దూసుకెళ్లిన ట్రైన్.. ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 07:10 AM
దాదాపు 100 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పల్టీ కొట్టి స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.

జర్మనీలోని దక్షిణ ప్రాంతంలో ఆదివారం ఓ రైలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన మ్యూనిచ్‌కు సుమారు 158 కిలోమీటర్ల దూరంలోని రీడ్‌లింగెన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫెడరల్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో రైలు బోగీలు స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి.
ప్రమాద వివరాలు
సాయంత్రం 6:10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రెండు బోగీలు రైలు పట్టాలు తప్పి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లాయి. గాయపడిన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.
జర్మన్ ఛాన్సలర్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.
ప్రమాదం ఎలా జరిగింది..
రెండు రైలు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాదానికి కారణం ఇంకా తెలియదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం పరిధిలోని 40 కిలోమీటర్ల రైలు మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. తీవ్రమైన తుఫానుల కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని జర్మన్ మీడియా తెలిపింది. రైలు సిగ్మారింగెన్ నుంచి ఉల్మ్ నగరానికి అడవి ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి