Rajasthan Royals Captain: రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ అతడే!
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:16 PM
ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన రాజస్తాన్ రాయల్స్‌తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ బంధం ముగిసిందని టాక్ వినిపిస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆర్ఆర్ కు కెప్టెన్‌గానూ సేవలు అందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) కు సంబంధించిన అప్ డేట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 వేలంకు సంబంధించి న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన రాజస్తాన్ రాయల్స్‌తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసిందని టాక్ వినిపిస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ బ్యాటర్.. రాజస్తాన్ రాయల్స్ కు కెప్టెన్‌గానూ సేవలు అందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్ రాయల్స్ ను.. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సంజూ తన సారథ్యంలో రెండోసారి 2022లో ఫైనల్ కు చేర్చాడు. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్‌తో పాటు కెప్టెన్‌గా కప్పు గెలవాలన్న సంజూ(Sanju Samson) ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ సారైనా సంజూ సారథ్యంలో ఆర్ఆర్(Rajasthan Royals) కప్ గెలుస్తుందని భావించారు. అయితే గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైందని సమాచారం. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్‌కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్(CSK)కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... రాజస్థాన్ తదుపరి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతుంది.
ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్ పేరు బలంగా వినిపిస్తోంది. రూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(Dhruv Jurel) అనతికాలంలోనే.. జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. గత కొంతకాలంగా అతడు సూపర్‌ఫామ్‌లో ఉండటమే కాక టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు. అలానే అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా జురెల్‌కు ఉంది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ ధ్రువ్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Dhruv Jurel Earns Test Squad: జురెల్‌కు బెర్త్ ఖరారే
Former Bangladesh Captain: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..