Former Bangladesh Captain: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:44 PM
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆదేశ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) తీవ్రమైన గుండెపోటు వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులు అహ్మద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్‌గా వైద్యులు నిర్దారించారు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్(Former Bangladesh Captain), ప్రస్తుత ఆదేశ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న (నవంబర్ 9) సాయంత్రం ఫారూఖీకి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులు అహ్మద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్(Faruk Ahmed heart attack)గా వైద్యులు నిర్దారించారు. ఫారూఖీకి యాంజియోగ్రామ్ చేయగా, గుండె ధమనల్లో బ్లాకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్సలో భాగంగా గుండెకు స్టంట్ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో అహ్మద్ ను ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
ఇక ఫారూఖీ(Faruk Ahmed) క్రికెట్ విషయానికి వస్తే.. ఆయన 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలందించారు. ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ వ్యవహరించేవాడు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. 2024 అగస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు. ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగారు. ఆతర్వాత అమినుల్ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు( BCB Vice President) తాత్కాలిక అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ లేనందుకు రూ.20 లక్షల జరిమానా.. ముజఫర్ నగర్‌లో ఏం జరిగిందంటే..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో 484ను 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..