Dinesh Karthik: దినేష్ కార్తీక్‌పై పాక్ క్రికెటర్ సెటైర్.. నెటిజన్ల ట్రోలింగ్ షురూ..
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:08 PM
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ పోరాటంలో కువైట్‌ను ఓడించిన పాక్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శనను కనబరిచింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ పోరాటంలో కువైట్‌ను ఓడించిన పాక్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శనను కనబరిచింది. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటి దారి పట్టింది. ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఆడే ఆరు ఓవర్ల మ్యాచ్‌లతో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు దినేష్ కార్తీక్ నాయకత్వం వహించాడు (Pakistan cricketer mock DK).
తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన అనంతరం దినేష్ కార్తీక్ సోషల్ మీడియాలో.. 'హాంకాంగ్ సిక్సెస్‌కు సరదా ప్రారంభం. పాక్ పై విజయం' అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత టీమిండియా ప్రస్థానం సజావుగా సాగలేదు. పాక్ మాత్రం తర్వాత వరుసగా విజయాలు సాధించి ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ విజయం అనంతరం ఆ జట్టు సభ్యుడు మహమ్మద్ షాజాద్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. 'హాంకాంగ్ సిక్సెస్‌కు సరదా ముగింపు. ఎప్పటిలాగే వ్యాపారం' అని దినేష్ పోస్ట్‌కు కౌంటర్ ఇచ్చినట్టు కామెంట్ చేశాడు.
ఈ పోస్ట్ చేస్తూ షాజాద్ ఉపయోగించిన హ్యాష్‌టాగ్ #WeHaveARealTrophy చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. భారతదేశం ఇంకా ఆసియా కప్ ట్రోఫీని అందుకోలేకపోవడాన్ని ఎగతాళి చేస్తూ షాజాద్ ఈ పోస్ట్ చేయడంతో ట్రోలింగ్ మొదలైంది. షాజాద్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డ్ అధినేత మొహ్సీన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు (Hong Kong Sixes 2025).
కాగా, హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ తరఫున దినేష్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, ప్రియాంక్ పంచల్, అభిమన్యు మిథున్, స్టూవర్ట్ బిన్నీ, షాబాజ్ నదీమ్ వంటి రిటైర్డ్ ఆటగాళ్లు బరిలోకి దిగారు (India vs Pakistan banter). వీరు ప్రస్తుతం ఏ తరహా క్రికెట్ కూడా ఆడడం లేదు. అందరూ దాదాపు 40 వయసులో ఉన్నారు. అయితే పాక్ తరఫున బరిలోకి దిగిన ఆటగాళ్లు మాత్రం కుర్రాళ్లే. వారందరూ పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నవారు కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ లేనందుకు రూ.20 లక్షల జరిమానా.. ముజఫర్ నగర్‌లో ఏం జరిగిందంటే..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో 484ను 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..