Novak Djokovic Wins: జొకో 101
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:34 AM
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో ఘనత సాధించాడు. కెరీర్‌లో 101వ ఏటీపీ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన హెలినిక్...
ఏథెన్స్ : సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో ఘనత సాధించాడు. కెరీర్‌లో 101వ ఏటీపీ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన హెలినిక్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో జొకో 4-6, 6-3, 7-5తో లొరెంజో ముసేటి (ఇటలీ)ని ఓడించి విజేతగా నిలిచాడు. ఓపెన్ ఎరాలో జొకోకంటే ముందు జిమ్మీ కానర్స్ (109), రోజర్ ఫెడరర్ (103) ఏటీపీ సింగిల్స్ టైటిళ్ల సెంచరీ కొట్టారు. అంతేకాదు..38 ఏళ్ల జొకో హార్డ్‌కోర్టులపై 72వ సింగిల్స్ టైటిల్‌తో మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈక్రమంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) పేరిట 71 సింగిల్స్ టైటిళ్లతో ఉన్న రికార్డును నొవాక్ బద్దలుకొట్టాడు. కాగా.. వరుసగా రెండో సంవత్సరమూ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ నుంచి జొకోవిచ్ వైదొలిగాడు. భుజం గాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నొవాక్ ప్రకటించాడు. పురుషుల విభాగంలో టాప్-8 ఎనిమిది మంది ఏటీపీ ఫైనల్స్‌లో తలపడుతున్నారు.