Share News

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:43 AM

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్‌డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన
Sai Sudharsan

ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్ట్ తొలి రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ మ్యాచులో కలచివేస్తున్న విషయం ఏంటంటే రిషబ్ పంత్ గాయంపై వచ్చిన అప్‌డేట్. యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆటలో పంత్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, గాయం కారణంగా అతడి లభ్యతపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కంటే ప్రస్తుతం పంత్ ఆరోగ్యంపై చర్చ మొదలైంది.


బంతి తగిలినట్లు తేలడంతో..

వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, సాయి సుదర్శన్‌తో కలిసి దూకుడుగా ఆడుతూ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆ క్రమంలో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అయితే, చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి, బంతి అతని కుడి కాలి బూట్‌పై బలంగా తాకింది. ఇంగ్లాండ్ జట్టు LBW కోసం అప్పీల్ చేసినా, అంపైర్ తిరస్కరించాడు. బెన్ స్టోక్స్ DRS తీసుకున్నాడు, కానీ పంత్ బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలడంతో అది విఫలమైంది.


ఈరోజు రాత్రి..

అయినప్పటికీ, 27 ఏళ్ల పంత్ తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. మైదానంలో లింపింగ్ చేస్తూ, తన ప్యాడ్‌లను తీసేశాడు. భారత జట్టు ఫిజియో వెంటనే అతన్ని పరిశీలించగా, పరిస్థితి మెరుగుపడకపోవడంతో పంత్‌ను ఆసుపత్రికి తరలించారు. సాయి సుదర్శన్ మాట్లాడుతూ, పంత్ స్కాన్‌ల కోసం వెళ్లినట్లు, ఈరోజు రాత్రి ఫలితాలు తెలుస్తాయని చెప్పాడు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నప్పటికీ, పంత్ ఆడకపోతే జట్టులోని ఇతర బ్యాట్స్‌మన్‌లు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపాడు.


మిగిలిన ఆటగాళ్లు..

పంత్ చాలా నొప్పితో ఉన్నాడు. స్కాన్‌ల కోసం వెళ్లారు. రేపటికి పూర్తి సమాచారం తెలుస్తుందన్నాడు. అతను బాగా ఆడుతున్నాడు కాబట్టి, అతను ఆడకపోతే జట్టుకు ఇది పెద్ద నష్టమన్నాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మన్‌లు, ఆల్‌రౌండర్లు ఈ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తారని సుదర్శన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.


సాయి సుదర్శన్ ఇన్నింగ్స్

సాయి సుదర్శన్ 151 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఏడు ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను నిరాశపరిచాడు. తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, ఒత్తిడిగా భావించలేదని, తన ఆటను ఆస్వాదించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. జట్టు కోసం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే నా లక్ష్యం. గత మ్యాచ్ ఆడానా, ఎవరి స్థానంలో ఆడుతున్నానా అని ఆలోచించడం లేదన్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 264/4 స్కోరుతో ఉంది. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కొక్కరూ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 24 , 2025 | 11:44 AM