TG Police, Hyderabad: పక్కా ప్లాన్‌తో రోడ్డుపై కీచకుడు.. ఇంతలో ఊహించని ట్విస్ట్..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:16 AM
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా యువతిని వేధిస్తున్న ఓ యువకుడు చివరకు ఆమెపై కత్తితో దాడి చేసేందుకు పథకం పన్ని వేచి చూస్తున్నాడు. ఈ విషయం పసిగట్టిన యువతి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి సదరు ప్రేమోన్మాదిని పట్టుకొని చితకబాది జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

- పట్టుకొని పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా యువతిని వేధిస్తున్న ఓ యువకుడు చివరకు ఆమెపై కత్తితో దాడి చేసేందుకు పథకం పన్ని వేచి చూస్తున్నాడు. ఈ విషయం పసిగట్టిన యువతి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి సదరు ప్రేమోన్మాదిని పట్టుకొని చితకబాది జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు అప్పగించారు. యువతి అప్రమత్తంగా ఉండటంతోనే తృటిలో ప్రాణాలతో బయటపడిందని కుటుంబసభ్యులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాద్ జిల్లా మొదుగుల గూడెంలో నివాసం ఉన్న సమయంలో ఓ యువతితో రెండేళ్ల కిత్రం వినయ్ (21) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అత ను యువతికి మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఈ వి షయమై యువతి కుటుంబ సభ్యులు అక్కడి సిరోల్ పోలీస్ స్టేషన్(Seerol Police Station)లో కేసు పెట్టారు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. యువతితో ఎలాంటి సం బంధం ఉండకూడదని చెప్పి అగ్రిమెంట్ రాయుంచుకున్నారు.
దానికి వినయ్ అంగీకరించాడు. ఆ తర్వాత యువతి కుటుంబం నగరానికి వచ్చి గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది. యువతి స్థానికంగా ఉన్న సూపర్‌మార్కెట్‌లో కొంతకాలంగా పని చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వినయ్ నగరానికి వచ్చి ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువత వెంట పడి కొంత కాలంగా వేధిస్తున్నాడు. యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా.. వినయ్ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. తాజాగా బుధవారం యువతి పని చేసున్న సూపర్‌మార్కెట్‌కు వచ్చి అక్కడే కత్తిని కొనుగోలు చేశాడు.
యువతికి కత్తిని చూపిస్తూ ఆమెను భయపెట్టేందుకుయత్నించాడు. తన ప్రేమను నిరాకరిస్తున్న యువతిపై దాడి చేసేందుకు అక్కడే వేచి చూస్తున్నాడు. ఇది గమనించిన యువతి స్టోర్ రూమ్‌లోకి వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వినయ్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడి వద్దనుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News