CBDT Extends: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగింపు
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:38 AM
ఆదాయపు పన్ను దాఖలు చేసే వారికి శుభవార్త వచ్చేసింది. పన్ను చెల్లింపుదారుల భారం తక్కువ చేయాలనే లక్ష్యంతో ఆదాయపు పన్ను శాఖ (CBDT) కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచింది.

ఆదాయపు పన్ను శాఖ (CBDT) పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో దీని గడువును జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. ఈ పొడిగింపునకు కారణం ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో ITR ఫారమ్‌లు, ఈ-ఫైలింగ్ సౌకర్యాలలో జాప్యం, జీతం పొందే ఉద్యోగస్తుల కోసం గడువును పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఇంకా రిటర్న్ దాఖలు చేయని వారు అనుకున్నంత సమయాన్ని పొందగలుగుతారు.
గడువు తప్పితే జరిమానా
ఈ గడువు పొడిగింపు ఉన్నప్పటికీ, స్వీయ-మదింపు పన్ను (Self-Assessment Tax) చెల్లించాల్సిన వారు మాత్రం జులై 31, 2025 లోపు చెల్లించాలి, లేకపోతే సెక్షన్ 234A కింద జరిమానా వడ్డీ విధించబడవచ్చు. ITR గడువులోపు దాఖలు చేయకపోతే, ఆదాయం రూ. 5 లక్షలకు మించిన వారు రూ. 5,000 జరిమానా, ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది (సెక్షన్ 234F). దీంతోపాటు ఆలస్య రిటర్న్‌లు, సవరించిన రిటర్న్‌ల (Belated and Revised ITR) దాఖలు కోసం గడువు డిసెంబర్ 31, 2025 వరకు ఉంటుంది.
ఫారమ్ 26AS, AIS సమస్యలు
చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS)లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఫారమ్‌లు ఆదాయం, TDS (Tax Deducted at Source), ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కలిగి ఉంటాయి. ఈ సమస్యల కారణంగా రిటర్న్ దాఖలు చేయడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కాబట్టి, ITR దాఖలు చేసే ముందు ఈ ఫారమ్‌లలోని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి.
ఆస్తి విక్రయంపై కొత్త నిబంధనలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, భూమి, లేదా షేర్లు విక్రయించిన వారికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్దతి (ఇండెక్సేషన్‌తో) లేదా కొత్త పద్దతి (ఇండెక్సేషన్ లేకుండా). ఇండెక్సేషన్ అనేది ఆస్తి కొనుగోలు ధరను ద్రవ్యోల్బణం ఆధారంగా సర్దుబాటు చేసి, పన్ను భారాన్ని తగ్గించే పద్ధతి. ఉదాహరణకు, జులై 23, 2024 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తి విక్రయిస్తే, మొత్తం కొనుగోలు ధరపై పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ లేకపోవడం వల్ల పన్ను భారం కొంత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి, ఆస్తి విక్రయించే ముందు ఈ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ITR దాఖలు తర్వాత నోటీసు వస్తే ఏం చేయాలి?
ITR దాఖలు చేసిన తర్వాత కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. ఈ నోటీసులు TDS అసమానతలు, ఆదాయం తప్పుగా నమోదు లేదా ఇతర సమస్యల కారణంగా రావచ్చు. నోటీసు వచ్చినప్పుడు, గడువులోపు స్పందించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. నోటీసులో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. గడువు తప్పితే, జరిమానా లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి