Rishabh Pant: టీమిండియాకు షాక్.. గాయపడ్డ పంత్
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:44 PM
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రిషభ్ పంత్ మరోసారి గాయపడ్డాడు. భారత్–సఫారీ ఏ మ్యాచ్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ త్వరగా కోలుకుని ఫీట్‌గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా(Team India)కు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) మరోసారి గాయపడ్డాడు. సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సన్నాహకంగా భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పంత్ ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ అనధికారిక టెస్టులో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ..
ఇరు జట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్(132) అద్భుతంగా రాణించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. సఫారీ పేసర్ షెపో మొరేకి వేసిన బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తగిలింది. అయినప్పటికీ పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో..
తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 221 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో టీమిండియాకు 34 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే తడబడింది. 108/4 వద్ద పంత్ క్రీజులోకి వచ్చాడు. మొరేకి బౌలింగ్‌లో తొలుత పంత్ ఎడమ మోచేతికి గాయమైంది. ఆ తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడుతూ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ పంత్ గాయపడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పంత్ త్వరగా కోలుకుని ఫీట్‌గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి