Share News

Ashwin: అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:47 PM

రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంచ్‌కే పరిమితం చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు.

Ashwin: అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి విజయంతో సఫారీలపై 0-1తో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అయితే మ్యాచ్ గెలిచినప్పటికీ జట్టు ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అసంతృప్తి వ్యక్తం చేశాడు.


తెలుగు అబ్బాయి.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)ని తుది జట్టులో ఆడించకపోవడంపై అశ్విన్ స్పందించాడు. ‘జట్టులో హార్దిక్(Hardik Pandya) లేనప్పుడు నితీశ్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికీ బెంచ్‌కే పరిమితం అయ్యాడంటే.. తప్పు టీమ్ సెలక్షన్‌లోనే ఉంది. తుది జట్టులో ఆడించే ఉద్దేశం లేనప్పుడు నితీశ్‌ను ఎందుకు సెలక్ట్ చేశారు? హార్దిక్ ఏం చేయగలడో నితీశ్ కూడా అదే చేస్తాడు. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అలా అనుకుంటే జట్టుకే ఎంపిక చేయడం మానేయండి’ అని అశ్విన్ సెలక్టర్లపై ఫైరయ్యాడు.


ఆడిస్తారా?

ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో నితీశ్ కుమార్ రెడ్డిని వన్డేలకు సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలో నితీశ్ తుది జట్టులో ఉంటాడనే అంతా భావించారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం నితీశ్ బదులుగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది. కానీ సుందర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. రెండో వన్డేలోనైనా నితీశ్‌కు అవకాశం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Updated Date - Dec 02 , 2025 | 04:48 PM