Share News

SMAT: హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:05 PM

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పాండ్య ఆల్‌రౌండ్ షోతో బరోడా జట్టు ఘన విజయం సాధించింది.

SMAT: హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. గాయం బారిన పడిన టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ఈ మ్యాచ్‌తోనే పునరాగమనం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా.. 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. హార్దిక పాండ్య(77*) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు విష్ణు సోలంకి(43), శాశ్వత్ రావత్(31) శుభారంభాన్ని అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన శివాలిక్ వర్మ(47) రాణించాడు.


పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ అభిషేక్ శర్మ(50) అర్ధ శతకం బాదాడు. అన్మోల్ ప్రీత్ సింగ్(69), నమన్ ధీర్(39) రాణించారు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ 3, రసిఖ్ సలామ్, హార్దిక్ పాండ్య, అతిత్ షెత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌ సూపర్‌4లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన హార్దిక్ ఇటీవల కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలోకి దిగి డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో మొదలుకానున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Updated Date - Dec 02 , 2025 | 05:03 PM