Share News

SMAT: అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:31 PM

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మహారాష్ట్ర-బిహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతి పిన్న వయసులోనే సెంచరీ బాదిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.

SMAT: అత్యంత పిన్న వయసులో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మరో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాద్ అలీ ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. అతిపిన్న వయసు(14 ఏళ్ల 250 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మంగళవారం మహారాష్ట్ర-బిహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 108 పరుగులు చేశాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉంది.


2013లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజయ్ 63 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అప్పుడు అతడి వయసు 18 ఏళ్ల 118 రోజులు. అయితే విజయ్ మహారాష్ట్రకే ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఫీట్ అందుకోవడం గమనార్హం. ఇటు వైభవ్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి శతకం. అతడు 15 ఏళ్లు నిండక ముందే టీ20ల్లో మూడో శతకం చేయడం విశేషం. అంతకు ముందు ఐపీఎల్ 2025, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లోనూ వైభవ్ సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికొస్తే, సూర్యవంశీ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం

Kane Williamson Record: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు

Updated Date - Dec 02 , 2025 | 02:31 PM