Priyanka Chaturvedi: ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:31 PM
ఆసియా కప్ 2025 షెడ్యూల్ రావడంతో క్రికెట్ ప్రపంచం మళ్లీ జోష్‌లోకి వచ్చింది. ఈ ప్రకటనతో రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టీమ్‌లు ఈసారి పోటీ పడనున్నాయి. అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తోన్నది ఏదంటే.. సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ మ్యాచ్‌ని హైలైట్‌గా చెబుతోంది. సూపర్ ఫోర్ రౌండ్, ఫైనల్‌లో కూడా ఈ రెండు టీమ్‌లు మళ్లీ తలపడే అవకాశం ఉందట.
మరో వివాదం..
ఏసీసీ అధ్యక్షుడు ఏమన్నారంటే, ఈ ఆసియా కప్ కేవలం క్రికెట్ ఆడటమే కాదు, ఆటతో పాటు లక్షలాది అభిమానుల హృదయాలను కూడా దగ్గర చేస్తుందన్నారు. అయితే, ఈ సంతోషకరమైన వార్తల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజ్యసభ ఎంపీ, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) బీసీసీఐపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎందుకంటే? పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం అంటే మన దేశ పౌరుల రక్తం, మన సైనికుల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా అని ప్రశ్నించారు.
పాకిస్తాన్‌తో క్రికెట్..
ఆమె భారత ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వల్ల 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భారతీయులు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటాన్ని వ్యతిరేకిస్తున్నారు.
భారత అభిమానులు
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చూశాం. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత టీమ్ సెమీఫైనల్‌కి చేరినప్పుడు, పాకిస్తాన్ టీమ్‌తో ఆడేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని భారత అభిమానులు స్వాగతించారు. ఇప్పుడు కూడా ఇలాంటి భావనలు ఎక్కువగా ఉన్నాయి.
ఎలాంటి అధికారం
క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఒక సోర్స్ చెప్పిన దాని ప్రకారం, బీసీసీఐపై ప్రభుత్వానికి నేరుగా నియంత్రణ లేదట. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ ఇంకా పాస్ కాలేదు. కాబట్టి, బీసీసీఐ నిర్ణయాలపై మాకు ఎలాంటి అధికారం లేదన్నారు. కానీ, ప్రజల భావనలను బీసీసీఐ ఎలా స్వీకరిస్తుందో చూస్తామని వెల్లడించింది.
పాటించడం కీలకం
ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు పాకిస్తాన్ తో కుదరవని, కానీ మల్టీలాటరల్ టోర్నమెంట్‌ల విషయంలో ఒలింపిక్ ఛార్టర్‌ని అనుసరించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఛార్టర్ రాజకీయ కారణాలతో వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. మరి 2036 ఒలింపిక్స్‌ని హోస్ట్ చేసే బిడ్‌లో భారత్ ఉన్నందున దీన్ని పాటించడం కీలకం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బీసీసీఐ ఈ టోర్నమెంట్‌లో భారత జట్టుని పంపుతుందా? లేక ప్రజల భావనలను గౌరవిస్తూ వెనక్కి తగ్గుతుందా? ఈ వివాదం ఎటు మళ్లుతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి