Find Colleague a Date: కొలీగ్‌కు లవర్‌ను వెతికిపెడితే బోనస్.. అమెరికా టెక్ కంపెనీ ఆఫర్
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:10 PM
కొలీగ్స్‌కు లవర్స్‌ను వెతికిపెట్టే ఉద్యోగులకు 500 డాలర్ల పారితోషికం ఇస్తామంటూ అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ క్లూలీ తాజాగా ప్రకటించింది. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: మంచి ప్రతిభ చూపే ఉద్యోగులకు కంపెనీలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. కొన్ని సంస్థలు డబ్బులు ఆఫర్ చేస్తే మరికొన్ని విదేశీ టూర్‌లను ఆఫర్ చేస్తుంటాయి. ప్రమోషన్లు కూడా ఇస్తుంటాయి. అయితే, నేటి ఆధునిక జమానాలో కంపెనీలు కొత్త పంథాలను అనుసరిస్తున్నాయి. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగు పరిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలను చేస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఓ అమెరికా సంస్థ తమ ఉద్యోగుల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు ఓ కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
క్లూలీ అనే ఏఐ స్టార్టప్ సంస్థ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, తోడు లేని ఉద్యోగులకు లవర్‌ను వెతికిపెట్టే సహోద్యోగులకు 500 డాలర్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇలా ఎంత మంది ఒంటరితనాన్ని దూరం చేస్తే అన్ని సార్లు 500 డాలర్లను పుచ్చుకోవచ్చన్నమాట. దీంతో, సంస్థలోని ఉద్యోగులు ఎగిరిగంతేశారు.
వాస్తవానికి క్లూలీ తయారు చేసే ఉత్పత్తులు కూడా ఇలాగే వినూత్నంగా ఉంటాయి. ప్రతి విషయంలో చీటింగ్‌యే తమ విధానం అంటూ కంపెనీ తమ ఉత్పత్తులను కొత్త తరహాలో ప్రచారం చేసుకుంటోంది. ఉదాహరణకు ఈ కంపెనీ చెందిన ఏఐ మీటింగ్ అసిస్టెంట్..జాబ్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకు సాయపడేందుకు రూపొందించారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎదుర్కునే ప్రశ్నలను ఈ ఏఐ అసిస్టెంట్ అప్పటికప్పుడు విశ్లేషించి ఎవరికీ అనుమానం రాకుండా యూజర్ ముందు సమాధానం ఉంచుతుంది. దీంతో యూజర్ టకటకా సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూల్లో గట్టెక్కొచ్చు. ఈ ప్రాడక్ట్ పెట్టుబడిదారులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే, ఓ ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ క్లూలీలో 15 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.
ఇక తాజా పథకంతో క్లూలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీ యీజమాన్యం సమప్రాధాన్యం ఇస్తోందని అనేక మంది కామెంట్ చేస్తున్నారు. భలే ఉంది కదూ ఈ ఆఫర్.
ఇవీ చదవండి:
10 ఏళ్ల బాలుడిని ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టేసిన తల్లిదండ్రులు
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..