Share News

Laura Wolvaardt: భారత్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది: లారా

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:58 PM

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. నవీ ముంబై వేదకగా టీమిండియా-సౌతాఫ్రికా ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Laura Wolvaardt: భారత్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది: లారా

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్(Women’s World Cup 2025) మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. నవీ ముంబై వేదకగా టీమిండియా-సౌతాఫ్రికా(India vs South Africa final) ఈ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఎవరూ గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరు జట్లు కప్‌ను ఒక్కసారి కూడా ముద్దాడలేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(Laura Wolvaardt) సంచలన వ్యాఖ్యలు చేసింది.


ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్ లారా మాట్లాడింది. ‘సొంత మైదానంలో ఆడటం వల్ల టీమిండియా(Team India)పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మాకు చాలా ఉత్సాహకరమైన అవకాశం. టీమిండియా వెంటే దేశమంతా ఉంది. వారు గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ అంచనాల వల్ల వారిపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇదే మాకు అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నా. మేము మ్యాచ్ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. టీమిండియాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. వారిని ఓడించాలంటే మేము చాలా బాగా ప్రదర్శన చేయాలి’ అని వ్యాఖ్యానించింది.


అదే కీలకం..

గత ప్రపంచ కప్ ఫైనల్స్ లేదా సెమీ ఫైనల్స్‌లో తమ జట్టు ఓటమిలో నేర్చుకున్న పాఠాలను లారా గుర్తు చేసుకుంది. ‘నేను ఫైనల్‌కు వచ్చిన మొదటిసారి.. మా మనసులో ట్రోఫీ గురించి, గెలవాలనే ఉత్సాహం గురించే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు నేను మా ఆటను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. మేము గొప్ప జట్టుతో తలపడబోతున్నాం. కాబట్టి భవిష్యత్తు గురించి కాకుండా ప్రాక్టీస్‌లో ఏం చేయాలి.. ఆటలో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలనే దానిపైనే దృష్టి పెడుతున్నాం. తొలిసారి ఫైనల్ కప్‌ను ముద్దాడే అవకాశం వచ్చినప్పుడు.. ఇది అతిపెద్ద ఈవెంట్‌గా అనిపిస్తుంది. కానీ మేము ఒత్తిడి తీసుకోకుండా.. ప్రశాంతంగా ఆడాలి’ అని లారా వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2025 | 12:58 PM