Share News

SMAT 2025: టీ20 టోర్నీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

ABN , Publish Date - Nov 21 , 2025 | 08:01 AM

నవంబర్ 26న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో జార్ఖండ్ జట్టుకు టీమిండియా స్టార్ హిట్టర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

SMAT 2025: టీ20 టోర్నీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT 2025) త్వరలోనే ప్రారంభం కానుంది. దీంట్లో జార్ఖండ్‌కు సంబంధించిన తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్ వంటి ఐపీఎల్ సంచలనాలకు చోటు దక్కింది. సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్ లాంటి బౌలర్లు ఎంపికయ్యారు. వీరందరినీ కలగలుపుకుని ఇషాన్ జార్ఖండ్ జట్టును నడిపించనున్నాడు.


ఘనమైన ట్రాక్ రికార్డు..

ఐపీఎల్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్(Ishan Kishan).. టీమిండియాలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇషాన్ గతంలో కూడా జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇషాన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు 206 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్.. 134.20 స్ట్రైక్ రేట్‌తో 5270 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.


నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ ఎలైట్‌ గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, తమిళనాడు, సౌరాష్ట్ర, త్రిపుర జట్లు ఉన్నాయి. జార్ఖండ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈసారి ఇషాన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ జట్టు అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగనుంది. స్టార్లతో నిండిన పటిష్టమైన జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.


జార్ఖండ్ తుది జట్టు..

ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్‌, అనుకూల్ రాయ్, పంకజ్ కుమార్, బాలకృష్ణ, మొహమ్మద్ కౌనైన్ ఖురేషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజన్దీప్ సింగ్.


ఇవి కూడా చదవండి:

మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 08:01 AM