Smriti Mandhana: పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:53 AM
టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. గత కొంత కాలంగా ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న స్మృతి.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆమె గురువారం ఇన్‌స్టా రీల్ ద్వరా ప్రకటించింది. ఆ సరదా రీల్‌లో స్మృతితో పాటు ఆమె సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్-స్మృతి గత కొలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
మోదీ గ్రీటింగ్స్..
పలాశ్ ముచ్చల్‌తో స్మృతి(Smriti Mandhana) పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్‌తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా పలాశ్- స్మృతి మంధాన జంటకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఓ లేఖ కూడా రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
గతంలో పలాశ్ హింట్
గత నెలలో ఇండోర్‌లోని స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పలాశ్ ముచ్చల్(Palash Muchhal) పెళ్లి గురించి హింట్ ఇచ్చారు. త్వరలోనే స్మృతి మంధాన ‘ఇండోర్ కోడలు’ కాబోతోందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. మరోవైపు స్మృతి ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో జట్టుకు చారిత్రక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో సహా, స్మృతి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో మొత్తం 434 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి