IPL 2026: మినీ వేలం ఎప్పుడంటే?
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:19 AM
ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 16న అబుదాబిలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా విదేశాల్లో వేలం వేయడం ఇది మూడో ఏడాది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మెగా టోర్నీకి సన్నాహాలు మొదలయ్యాయి. శనివారంతో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగిసింది. గత రెండేళ్లుగా విదేశాల్లో జరుగుతున్న ఈ వేలాన్ని ఈ సారి స్వదేశంలో నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్(IPL 2026) మినీ వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే దానిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2026 మినీ వేలం ఈ సారి కూడా విదేశాల్లోనే జరగనున్నట్లు బీసీసీఐ(BCCI) వెల్లడించింది. డిసెంబర్ 16న అబుదాబిలో ఈ టోర్నీకి సంబంధించిన వేలం జరుగుతుందని తెలిపింది. అయితే విదేశాల్లో వేలం నిర్వహించడం ఇది మూడో ఏడాది. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం వేశారు.
రిలీజ్ అయిన డేంజరెస్ ప్లేయర్లు
డేంజరెస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ఆల్‌రౌండర్‌గా రసెల్ కేకేఆర్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చాడు. కానీ జట్టు అతడిని వదులుకోవడం అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. గత సీజన్‌లో అత్యధిక డబ్బు పెట్టి కొనుగోలు చేసిన బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(రూ.23.75కోట్లు)ను కూడా కేకేఆర్ వదిలేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సూపర్ బౌలింగ్ చేస్తూ విజయంలో కీలక పాత్ర పోషించే మహిశా పతిరణాను కూడా ఆ జట్టు రిలీజ్ చేసింది. ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి