Share News

Hyderabad: ఉప్పల్‌లో నేడు బిగ్‌ ఫైట్‌..

ABN , Publish Date - Apr 23 , 2025 | 09:12 AM

ఉప్పల్‌ స్టేడియం.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే నగరంలో జరిగే ఆసక్తికర మ్యాచ్‌కు వేదిక కానుంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లోని బిగ్‌-3 టీమ్‌ల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌తో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బుధవారం తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad: ఉప్పల్‌లో నేడు బిగ్‌ ఫైట్‌..

- సన్‌రైజర్స్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌

హైదరాబాద్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే నగరంలో జరిగే ఆసక్తికర మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) ముస్తాబైంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లోని బిగ్‌-3 టీమ్‌ల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌తో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బుధవారం తలపడనుంది. ముంబై మాజీ సారథి రోహిత్‌ శర్మ(Rohit Sharma)తోపాటు లోకల్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ విన్యాసాలు చూసేందుకు అభిమానులు ఆసక్తితో వేచి చూస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసుల నోటీసులు


city4.jpg

మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్స్‌లో తిలక్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు ఇరు జట్ల క్రికెటర్లు తీవ్రంగా చెమటోడ్చారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముందు జాగ్రత్తగా స్టేడియంలోని పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2025 | 09:12 AM