
IPL 2025 CSK vs SRH: చెపాక్ ఫైట్.. గెలుపు తప్ప వేరే ముచ్చటే లేదు
ABN , First Publish Date - Apr 25 , 2025 | 07:28 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక సమరం మొదలైపోయింది. గెలుపు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇరు జట్లు ఆఖరి క్షణం వరకు నువ్వానేనా అంటూ తలపడటం ఖాయం.

Live News & Update
-
2025-04-25T21:07:10+05:30
చెన్నై మరో వికెట్ కోల్పోయింది.
అన్షుల్ కాంబోజ్ (2)ను వెనక్కి పంపించాడు కమిన్స్.
కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు అన్షుల్.
ప్రస్తుతం 17.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులతో ఉంది సీఎస్‌కే.
-
2025-04-25T21:01:25+05:30
ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు సీఎస్‌కే షేక్
సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు సీఎస్‌కే బ్యాటర్లు వణుకుతున్నారు.
ఆ టీమ్ 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
ధోని (6)ని తెలివైన బంతితో ఔట్ చేశాడు హర్షల్ పటేల్.
-
2025-04-25T20:31:38+05:30
అజిత్ సందడి
సీఎస్‌కే-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అటెండ్ అయ్యాడు.
కుటుంబ సమేతంగా మ్యాచ్‌కు హాజరైన అజిత్.. నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కావ్యా మారన్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. సన్‌రైజర్స్ బౌలర్లు వికెట్లు తీసిన ప్రతిసారి చప్పట్లు కొడుతూ స్టాండ్స్‌లో సందడి చేసిందామె.
-
2025-04-25T20:25:27+05:30
జడేజా కూడా పాయె
సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు.
సీఎస్‌కే 4వ వికెట్ కోల్పోయింది.
జోరు మీదున్న జడేజా (21)ను స్పిన్నర్ కమిందు మెండిస్ ఔట్ చేశాడు.
ప్రస్తుతం 9.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 74 పరుగులతో ఉంది చెన్నై.
-
2025-04-25T20:05:31+05:30
థర్డ్ వికెట్ డౌన్
సీఎస్‌కే 3వ వికెట్ కోల్పోయింది.
రెచ్చిపోయి ఆడుతున్న ఆయుష్ మాత్రే (30)ని కమిన్స్ వెనక్కి పంపించాడు.
కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు మాత్రే. ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 5.3 ఓవర్లలో 3 వికెట్లకు 47.
-
2025-04-25T19:57:18+05:30
సీఎస్‌కేకు రెండో ఝలక్ తగిలింది.
ఆల్‌రౌండర్ శామ్ కర్రన్ (9)ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు.
ప్రస్తుతం చెన్నై స్కోరు 4.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 39.
-
2025-04-25T19:52:45+05:30
సీఎస్‌కే యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.
17 ఏళ్ల ఆయుష్.. షమి, కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను బాదేస్తున్నాడు.
ఇప్పటికే 15 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
-
2025-04-25T19:39:35+05:30
సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరో అరుదైన ఘనత సాధించాడు.
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో టీ20 కెరీర్‌లో 400 మ్యాచుల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చాడు మాహీ.
-
2025-04-25T19:35:22+05:30
సీఎస్‌కేకు ఫస్ట్ ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే మొదటి వికెట్ కోల్పోయింది చెన్నై.
షమి బౌలింగ్‌లో స్లిప్స్‌లో ఉన్న అభిషేక్‌కు క్యాచ్ ఇన్ని వెనుదిరిగాడు షేక్ రషీద్ (0)
-
2025-04-25T19:28:24+05:30
ప్లేయింగ్ ఎలెవన్‌లో 3 కీలక మార్పులు చేసింది చెన్నై టీమ్.
రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్ స్థానంలో డెవాల్డ్ బ్రేవిస్, శామ్ కర్రన్, దీపక్ హుడాకు చోటు కల్పించింది సీఎస్‌కే.
ట్రావిస్ హెడ్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో కుశాల్ మెండిస్‌ను తీసుకుంది ఎస్‌ఆర్‌హెచ్.
వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి కూడా తుదిజట్టులో చోటు కల్పించింది ఆరెంజ్ ఆర్మీ.
-
2025-04-25T19:28:23+05:30
సీఎస్‌కే-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది.
టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ సారథి కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆతిథ్య చెన్నై మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.