India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..
ABN , Publish Date - Jul 23 , 2025 | 08:20 AM
ఇంగ్లండ్ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.

ఇంగ్లండ్(England)లోని డర్హామ్ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు (India Women Cricket Team) అదరగొట్టింది. ఇంగ్లండ్‌పై 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 100 ఓవర్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ అద్భుత ప్రదర్శన కనబరిచాయి.
చివరి వరకూ..
ఇంగ్లండ్ బ్యాటర్లు నాట్ స్కివర్-బ్రంట్, ఎమ్మా లాంబ్, ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ దూకుడుగా ఆడారు. భారత బౌలర్ క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్‌తో వారిని కట్టడి చేసినప్పటికీ, రన్ రేట్ నిరంతరం పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ, భారత జట్టు చివరి వరకూ పట్టుదలతో పోరాడి, అద్భుతమైన వ్యూహంతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పలువురు ప్రముఖులు భారత్ విజయం పట్ల అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర
ఈ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. ఆమె తన ఏడో వన్డే సెంచరీని (102) పూర్తి చేసి వావ్ అనిపించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు తొలి రెండు మ్యాచ్‌లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేసిన హర్మన్‌ప్రీత్, ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో తన నైపుణ్యాన్ని చాటుకుంది. ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఈ సెంచరీ ఆమెకు, జట్టుకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
వచ్చే సిరీస్ కూడా.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు, ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించారు. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో మాయాజాలం కనబరిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడినప్పటికీ, భారత జట్టు వ్యూహాత్మకంగా వారి ఆటను నియంత్రించి, రన్ రేట్‌ను అదుపులో ఉంచింది. చివరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని, జట్టు సమిష్టిగా కృషి చేసి విజయాన్ని సాధించింది. ఈ సిరీస్ విజయం భారత మహిళా క్రికెట్ జట్టు బలాన్ని, ఐక్యతను చాటిచెప్పింది. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ కప్‌లోనూ ఈ జోరు కొనసాగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి