Share News

Dangerous Diet: స్లిమ్‌గా మారేందుకు రెండు వారాల డైట్.. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు చైనా యువతి..

ABN , Publish Date - Jul 23 , 2025 | 08:24 AM

త్వరలో ఆ యువతి 16వ జన్మదినోత్సవం రాబోతోంది. ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఆమె తనకు నచ్చిన ఓ డ్రెస్ కొనుక్కుంది. అయితే ఆ డ్రెస్ వేసుకోవాలంటే ఆమె కొద్దిగా సన్నబడాలి. తన పుట్టిన రోజుకు రెండు వారాల సమయమే ఉండడంతో ఆ యువతి డైటింగ్ ప్రారంభించింది.

Dangerous Diet: స్లిమ్‌గా మారేందుకు రెండు వారాల డైట్.. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు చైనా యువతి..
Dangerous Diet

త్వరలో ఆ యువతి 16వ జన్మదినోత్సవం రాబోతోంది. ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఆమె తనకు నచ్చిన ఓ డ్రెస్ కొనుక్కుంది. అయితే ఆ డ్రెస్ వేసుకోవాలంటే ఆమె కొద్దిగా సన్నబడాలి. తన పుట్టిన రోజుకు రెండు వారాల సమయమే ఉండడంతో ఆ యువతి డైటింగ్ (Dieting) ప్రారంభించింది. అయితే ఆ డైటింగ్ ఆమె ప్రాణాలకు ప్రమాదంగా మారింది. పుట్టిన రోజు సమయానికే హాస్పిటల్‌లో జాయిన్ కావాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మరింది (Dangerous Diet).


చైనా (China)లోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మెయి అనే అమ్మాయి తన పుట్టినరోజున కొత్త దుస్తులు ధరించడానికి స్లిమ్‌గా కనిపించాలని భావించింది. అందుకోసం ప్రత్యేకంగా డైటింగ్ ప్రారంభించింది. రెండు వారాల పాటు కేవలం ఉడికించిన కూరగాయలు (vegetable only diet) మాత్రమే తీసుకుంది. ఉడికించిన కూరగాయలు, మంచినీళ్లు తప్ప మిగిలిన వాటిని దూరం పెట్టేసింది. తొలి వారం మంచి ఫలితాలే కనిపించాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారింది. శరీరీం వదులుగా అయిపోయింది. డైటింగ్ ప్రారంభించిన 12వ రోజు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది.


అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను కాపాడటానికి డాక్టర్లు 12 గంటలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేశారు. మెయి శరీరంలో పొటాషియం పరిమాణం బాగా తగ్గిపోవడంతో ఆమె కండరాలు, నరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. పొటాషియం లోపం చాలా ప్రమాదకరమైనది. అది గుండెపోటు లేదా మరణానికి కూడా దారి తీస్తుంది. చికిత్సతో కాస్త కోలుకున్న మెయి ఇటీవలె డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది.


ఇవి కూడా చదవండి..

ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..


మీ చూపు షార్ప్ అయితే.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2025 | 08:24 AM