Share News

IND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:17 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచ‌రీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌న సూప‌ర్ జెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్న జురెల్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో శతకం చేశాడు.

IND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌
India A vs South Africa

దక్షిణాఫ్రికాతో భారత-ఎ జట్టు అనధికరిక టెస్టు(India A vs South Africa) జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచ‌రీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌న సూప‌ర్ జెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్న జురెల్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో సెంచరీ చేశాడు. జురెల్(Dhruv Jurel) 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో త‌న 6వ ఫ‌స్ట్ క్లాస్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. తొలుత హర్ష్‌ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్‌.. ఆ తర్వాత కెప్టెన్‌ పంత్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్ ఓవరాల్‌గా 169 బంతులు 127 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.


ఇక మ్యాచ్(India A vs South Africa) విషయానికి వస్తే.. ఇండియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురెల్ 175 బంతుల్లో 132 పరుగులు చేశాడు. అలానే రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఏ జట్టు 382-7 వద్ద డిక్లేర్‌ చేసింది. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 221 పరుగులకే ఆలౌట్ అయింది. మొత్తం 11 మందిలో ఏకంగా 8 మంది బ్యాటర్లు సెనొక్వనే (0), జుబేర్‌ హమ్జా (8), బవుమా (0), ఎస్తర్‌హ్యుజెన్‌ (0), టియాన్‌ వాన్‌ (6), కైల్‌ సిమండ్స్‌ (5), షెపొ మొరెకి (4 నాటౌట్‌), ఒకులె సెలె (0)లను భారత సీమర్లు సింగిల్‌ డిజిట్‌కే కట్టడి చేశారు. భారత పేస్‌ త్రయం ప్రసిధ్‌ కృష్ణ( Prasidh Krishna) (3/35), ఆకాశ్‌ దీప్‌ (2/28), సిరాజ్‌ (2/61) నిప్పులు చెరిగారు. దీంతో భారత్ రెండ ఇన్నింగ్స్ లో కలిపి సఫారీల ముందు 416 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.


ఇక భారత బ్యాటర్లలో జురెల్‌(Dhruv Jurel)తో పాటు రిషబ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన పంత్‌(Rishabh Pant).. దూబే(84 పరుగులు) ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం పంత్‌ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బౌలర్లలో ఒకుహ్లే సెలె మూడు వికెట్లు పడగొట్టగా.. షెపో మోరెకి, వుర్రెన్‌, సుబ్రెయిన్‌, సిమండ్స్‌ తలా వికెట్‌ సాధించారు. ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ కూడా కోల్పోకుండా 25 పరుగల వద్ద ఉంది. ఇక సౌతాఫ్రికా విజయానికి 392 పరుగులు కావాలి.


ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

భారీ రికార్డుకు చేరువలో బుమ్రా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 05:43 PM