Revanth Reddy Birthday Celebrations: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:01 PM
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవాళ (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేస్తూ టపాసులు పేలుస్తూ శుభాకాంక్షలు (Revanth Reddy Birthday Celebrations) చెబుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీల ముఖ్య నేతలు సహా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెల్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలుక మధుసూదన్ రెడ్డి(Chiluka Madhusudhan Reddy) ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. 'తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ప్రజా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అన్ని వర్గాల ఆశీస్సులు ఉన్న మన ముఖ్యమంత్రికి భగవంతుడు గట్టి బలం, సంకల్పం అందించాలి. ఈ రాష్ట్రానికి మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వాలి' అని ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News