Share News

IND vs ENG 5th Test: సిరాజ్ మెరుపు దెబ్బ.. సిరీస్ సమం చేసేందుకు భారత్ సిద్ధం

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:28 AM

ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి, ఐదో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మూడో రోజు ముగిసే సమయానికి భారత జట్టు మంచి ఊపుతో ఉంది. మోహమ్మద్ సిరాజ్ చివరి బంతికి జాక్ క్రాలీని ఔట్ చేసి, భారత్‌కు మరింత జోష్ అందించాడు.

IND vs ENG 5th Test: సిరాజ్ మెరుపు దెబ్బ.. సిరీస్ సమం చేసేందుకు భారత్ సిద్ధం
IND vs ENG 5th Test siraj

ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో (India vs England 5th Test Match) మూడో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) చివరి బంతితో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ (14)ని ఔట్ చేసి అదరగొట్టాడు. ఆ క్రమంలో ఇంగ్లండ్ మూడో రోజు స్టంప్స్ వద్ద 13.5 ఓవర్లలో 50/1 స్కోరుతో ఉంది. ఈ క్రమంలో 324 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.


ఇంగ్లండ్ మాత్రం

ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో రోజు రెండు జట్లకు కీలకంగా మారనుంది. శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు సిరీస్‌ను 2-2తో సమం చేసి అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే 9 వికెట్లు త్వరగా తీయాలి. ఇంగ్లండ్ మాత్రం 324 పరుగులు చేసి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

భారత బ్యాటింగ్

మూడో రోజు భారత రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో మెరిసాడు. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జడేజా, ద్రువ్ జురెల్ (34) కలిసి ఏడవ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచారు. వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడి, 12 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ బ్యాటింగ్ ప్రదర్శన భారత్‌కు మంచి పరుగుల ఆధిక్యాన్ని అందించింది. ఇది ప్రస్తుతం ఇంగ్లండ్‌కు సవాలుగా నిలిచింది.


సిరాజ్ మెరుపు దెబ్బ

మహమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మూడో రోజు చివరి బంతితో క్రాలీ స్టంప్స్‌‎ను ఔట్ చేసి అభిమానులకు మంచి జోష్ ఇచ్చాడు. దీంతో సిరాజ్ ఈ సిరీస్‌లో 18 వికెట్లతో జాయింట్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (34*), క్రాలీ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, సిరాజ్ చివర్లో కట్టడి చేయడంతో భారత్‌కు నాలుగో రోజు ఎక్కువగా స్కోప్ ఉందని చెప్పవచ్చు.


సిరీస్ సమం చేయడానికి భారత్ ఏం చేయాలి?

సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే భారత బౌలర్లు, ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లు నాలుగో రోజు తొలి సెషన్‌లో వికెట్లు తీసుకోవడం చాలా కీలకం. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్‌లను త్వరగా ఔట్ చేయడం ద్వారా భారత్ ఒత్తిడి నుంచి బయటపడుతుంది.

సిరాజ్, ప్రసిద్ రెండవ రోజు ఇంగ్లండ్‌ను 247కు ఆలౌట్ చేసిన విధంగా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలి. దీంతోపాటు ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ బౌలింగ్ చేంజెస్ కూడా కీలకం. రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచవచ్చు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 08:30 AM