Ashes Test: పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే!
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:34 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు ఇటీవలే పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఆసీస్ కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 164 పరుగులు చేసింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. రెండు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
రెండు రోజులకే..
ఈ మ్యాచ్(Ashes Test) కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్ట్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ పిచ్‌కు ఐసీసీ ఏ రేటింగ్ ఇస్తుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఐసీసీ పెర్త్ పిచ్‌కు ‘వెరీ గుడ్ రేటింగ్’ ఇచ్చింది. కాగా ఇదే అత్యుత్తమ రేటింగ్ కావడం గమనార్హం.
ఏ రేటింగ్ ఇస్తుందో..?
భారత్-సౌతాఫ్రికా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. బంతి విపరీతంగా స్పిన్ అవ్వడంతో బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా(55) ఒక్కడే ఓపిగ్గా పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఐసీసీ ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు ఏం రేటింగ్ ఇస్తుందో అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ