Share News

Jemimah Rodrigues: బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!

ABN , Publish Date - Nov 27 , 2025 | 03:04 PM

మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Jemimah Rodrigues: బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
Jemimah Rodrigues

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో స్మృతి స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌కు జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి మద్దతుగా ఉండేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.


నవంబర్ 9న మహిళల బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుకు జెమీమా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే స్మృతి వివాహం కోసం పది రోజుల క్రితం జెమీమా భారత్‌కు తిరిగొచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ వేడుకలు నిలిచిపోయాయి. దీంతో స్మృతి, ఆమె కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు జెమీమా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు బ్రిస్బెన్ హీట్ జట్టు సీఈవో టెర్రీ స్వెన్సన్ వెల్లడించారు.


‘జెమీకి ఇది నిజంగా సవాలుతో కూడుకున్న సమయం. ఆమె బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగకపోవడం అభిమానులకు అసంతృప్తి కలిగించే విషయమే. కానీ ఆమె వ్యక్తిగత ప్రాధాన్యాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆమె అభ్యర్థనను మేం అంగీకరించాం. ఆమెకు, స్మృతి మంధాన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం’ అని టెర్రీ స్వెన్సన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Smriti unfollowed Palas: ఇన్‌స్టా‌లో పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి! నిజం ఏంటంటే..

ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

Updated Date - Nov 27 , 2025 | 03:04 PM