Share News

Cricket: ఇకపై అలాంటి క్యాచ్‌లు కుదరదు.. బౌండరీ క్యాచ్‌లపై కొత్త రూల్స్..

ABN , Publish Date - Jun 14 , 2025 | 02:05 PM

క్రికెట్‌లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్‌ల విషయంలో కొత్త రూల్స్‌ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్‌లను ఇల్లీగల్‌గా పరిగణించనున్నారు..

Cricket: ఇకపై అలాంటి క్యాచ్‌లు కుదరదు.. బౌండరీ క్యాచ్‌లపై కొత్త రూల్స్..

బ్యాట్స్‌మన్ బంతిని బౌండరీకి తరలించాలని చూడడం, ఫీల్డర్లు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చూడడం సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో సిక్సులు, ఫోర్లు వెళ్లే బంతిని ఫీల్డర్లు ఎంతో సాహసంతో అడ్డుకుంటుంటారు. బౌండరీ లైన్ దగ్గర సినిమా స్టైల్లో స్టంట్స్ చేసి మరీ బంతిని క్యాచ్ పట్టుకోవడం చూస్తుంటాం. అయితే ఇకపై ఇలాంటి బౌండరీ క్యాచ్‌లు పట్టుకుంటామంటే కుదరదు. బౌండరీ క్యాచ్‌లపై ఐసీసీ త్వరలో కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.


క్రికెట్‌లో ఐసీసీ (ICC) త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్‌ల విషయంలో కొత్త రూల్స్‌ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే 'బన్నీ-హాప్స్' క్యాచ్‌లను ఇల్లీగల్‌గా పరిగణించనున్నారు. అయితే బౌండరీ లోపల నుంచి బంతిని నెట్టి, ఆపై బయటికి వెళ్లి.. తిరిగి డైవ్ చేసి క్యాచ్‌ను పూర్తి చేసేందుకు మాత్రం అనుమతి ఉంటుంది.


బంతిని ఫీల్డర్ మొదటిసారి బౌండరీ వెలుపల నుంచి తాకిన సమయంలో.. అది క్యాచ్‌గా పరిగణించాలంటే ఆ ఫీల్డర్ తప్పనిసరిగా మైదానం లోపల ల్యాండ్ అవ్వాలి. దీన్ని బట్టి ఇకపై బౌండరీ వెలుపల బంతిని అనేకసార్లు గాల్లోకి ఎగురవేయడం కుదరదన్నమాట. ఈ కొత్త నిబంధన ICC వచ్చే వారం నుంచి అమలు చేయనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఎంసీసీ (MCC) అమలు చేయనుందని తెలిసింది. క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు అన్యాయంగా అనిపిస్తున్నాయంటూ పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ అంశంపై ఎంసీసీ మాట్లాడుతూ.. ‘మేము కొత్త రూల్స్‌ను రూపొందించాం. దీని ప్రకారం 'బన్నీ-హాప్స్' క్యాచ్‌లను నిషేధించాం. బౌండరీ లోపల నుంచి బంతిని పైకి నెట్టి, బయటికి వెళ్లి, ఆపై డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది.’ అని వివరించింది. ‘ఒకవేళ బంతిని వేరే ఫీల్డర్‌కు పంపినా లేదా మైదానంలోకి నెట్టినా.. ఫీల్డర్ బౌండరీ బయట ల్యాండ్ అయితే.. లేదా ఆ తర్వాత బయటికి వెళితే.. దాన్ని బౌండరీ కింద పరిగణిస్తారు. బౌండరీ బయట నుంచి గాల్లోకి ఎగిరి.. బంతిని తాకడానికి ఫీల్డర్‌కు ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటి వెళ్లొద్దు’.. అని ఎంసీసీ వివరణ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి:

అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్

ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 02:05 PM