World Club Championship: క్రికెట్‌లోనే అతిపెద్ద సమరం.. వాటే ఐడియా సర్ జీ!
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:57 PM
లీగ్ క్రికెట్‌లో అతిపెద్ద సమరానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచలోని బడా లీగ్ విన్నర్ టీమ్స్ అంతా ఓ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో ఐపీఎల్ ఒక సంచలనం అనే చెప్పాలి. భారత క్రికెట్ బోర్డు దగ్గర నుంచి టీమిండియా ప్లేయర్లు, దేశవాళీ క్రికెటర్లు, ఓవర్సీస్ ఆటగాళ్ల వరకు.. బంగారు గుడ్లు పెట్టే క్యాష్ రిచ్ లీగ్‌తో ఎంతో మంది కోట్లు వెనకేసుకున్నారు. దీంతో ఐపీఎల్‌ను చూసి ఇతర దేశాల్లోనూ బోలెడు పొట్టి లీగ్‌లు పుట్టుకొచ్చాయి. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ది హండ్రెడ్, సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్.. ఇలా దాదాపుగా ప్రతి క్రికెట్ టీమ్ తమ దేశంలో ఒక లీగ్‌ను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడీ లీగ్స్‌తో ఓ పెద్ద ప్రయోగమే జరగబోతోంది. ఈ అన్ని టీమ్స్‌ను కలిపి ఓ మహా సమరానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మళ్లీ వచ్చేస్తోంది..
క్రికెట్‌లోనే బిగ్ ఫైట్‌కు త్వరలో తెరలేవనుంది. వచ్చే ఏడాది వరల్డ్ క్లబ్ చాంపియన్‌షిప్-2026 నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్, ది హండ్రెడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర బడా క్రికెట్ లీగ్స్‌లో చాంపియన్‌లుగా నిలిచిన పలు ఇతర జట్లతో ఓ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. అదే వరల్డ్ క్లబ్ చాంపియన్‌షిప్. దాదాపుగా ఇదే ఫార్మాట్‌లో ఒకప్పుడు చాంపియన్స్ లీగ్ నిర్వహించేవారు. ఇప్పుడు అదే లీగ్‌ను సరికొత్తగా వరల్డ్ క్లబ్ చాంపియన్‌షిప్ రూపంలో మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
3 జట్లతో..
ఐపీఎల్ నుంచి 3 జట్లు ఈ టోర్నీలో ఆడతాయని వినిపిస్తోంది. పీఎస్‌ఎల్, బీబీఎల్, ఎస్‌ఏ20, సీపీఎల్, ది హండ్రెడ్ నుంచి కొన్ని జట్లు పాల్గొంటాయని సమాచారం. 2026 మార్చి నుంచి మే వరకు ఈ టోర్నీ నిర్వహణకు ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా ఈ బడా టోర్నమెంట్ జరుగుతుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం. క్రికెట్ లవర్స్ మాత్రం వాటే ఐడియా.. ఈ మ్యాచుల కోసం ఆసక్తిగా ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి