India vs New Zealand Live Streaming: రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:48 PM
India Match Live Streaming: భారత్-న్యూజిలాండ్ మధ్య మరో సమరం జరగనుంది. అయితే ఈసారి జరగబోయేది నాకౌట్ ఫైట్. కప్పు కోసం జరిగే ఈ కొట్లాటను ఎక్కడ స్ట్రీమింగ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..

రోహిత్ సేన మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి జరిగేది ఆఖరి సమరం. చాంపియన్స్ ట్రోఫీ కోసం తుదిపోరుకు రెడీ అవుతోంది టీమిండియా. ఇన్ని మ్యాచులు ఒకెత్తయితే.. ఇది మరొకెత్తు. ఈసారి ఆడబోయేది డేంజరస్ టీమ్ న్యూజిలాండ్‌తో. గ్రూప్ స్టేజ్‌లో ఆ టీమ్‌ను భారత్ చిత్తు చేసింది. అలాగని తక్కువ అంచనా వేయడానికి లేదు. గాయపడిన కివీస్.. మన మీద భీకర పోరాటం చేసేందుకు రెడీ అవుతోంది. అందుకే లైట్ తీసుకోవడానికి లేదు. పట్టువదలకుండా ఫైట్ చేయడంలో ఆరితేరిన శాంట్నర్ సేనను ఓడించాలంటే మెన్ ఇన్ బ్లూ తమ బెస్ట్ ఇవ్వక తప్పదు. మరి.. ఇంతగా ఆసక్తి రేపుతున్న ఫైనల్ ఫైట్‌ను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం..
స్ట్రీమింగ్ అందులోనే..
భారత్-కివీస్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9వ తేదీ) నాడు మధ్యాహ్నం 2.30 గంటలకు షురూ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానల్స్‌లో లైవ్‌గా చూడొచ్చు. అదే ఓటీటీలో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ చేయొచ్చు. మ్యాచ్ ఆరంభానికి ముందే ప్రముఖ క్రికెటర్లతో పిచ్ రిపోర్ట్, ప్రీ మ్యాచ్ అనాలసిస్, స్వాట్ అనాలసిస్ లాంటివి టెలికాస్ట్ చేస్తారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీంతో అభిమానులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ కలగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
మ్యాచ్ మధ్యలో కోహ్లీని రెచ్చగొట్టా: పాక్ స్పిన్నర్..
ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..
ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి