Virat Kohli: ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:36 PM
ICC Champions Trophy 2025 Final: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 4 ఐసీసీ ట్రోఫీలు తన ఖాతాలో వేసుకొని.. ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. కెరీర్ ఆరంభంలోనే వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ-2013నూ ముద్దాడాడు. ఇటీవల టీ20 ప్రపంచ కప్-2024ను చేతబట్టిన కింగ్.. తక్కువ గ్యాప్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025ను కైవసం చేసుకొని కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల కింద తను పడిన వేదన, బాధను అతడు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. మరి.. విరాట్‌ను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ఘటన ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
హగ్ చేసుకొని..
కివీస్‌తో జరిగిన ఫైనల్స్ ముగిసిన తర్వాత స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను ఓదార్చాడు కోహ్లీ. ఓటమి బాధలో ఉన్న కేన్ మామ దగ్గరకు వెళ్లిన విరాట్.. అతడితో ముచ్చటించి సముదాయించాడు. కప్పు చేజారడంతో న్యూజిలాండ్ స్టార్ నిరాశలో కూరుకుపోయాడు. దీన్ని గమనించిన కోహ్లీ అతడ్ని ఓదార్చాడు. హగ్ చేసుకొని.. కొద్దిసేపు అతడితేనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఓడితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నాడు. ఆ బాధ తాను అనుభవించానన్నాడు.
ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి
‘నా మిత్రుడు కేన్ విలియమ్సన్‌ను ఇలా బాధగా చూడటం నచ్చలేదు. అతడు ఓడిన జట్టులో ఉండటం బాధాకరం. అయితే నేనూ ఈ బాధను అనుభవించా. ఓడిపోయిన టీమ్స్‌లో నేనూ భాగంగా ఉన్నా. పరాభవం చెందిన జట్టులో నేను ఉన్నప్పుడు.. అతడు గెలిచిన టీమ్‌లో భాగంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. మా మధ్య అనుబంధం, ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
గజినీలా మారిన రోహిత్.. కప్పు మర్చిపోయి..
రోహిత్‌కు అనుష్క హగ్.. రితికా ముందే..
అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి