Share News

Malavika Mohanan: ఆ టీమిండియా స్టారే నా ఫేవరెట్.. ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:28 PM

Team India: ఓ టీమిండియా స్టార్ తన ఫేవరెట్ అని అంటోంది ప్రభాస్ హీరోయిన్ మాళవికా మోహనన్. అతడి ఆటకు తాను ఫ్యాన్‌నని చెబుతోంది. మరి.. మాళవికను అంతగా ఇంప్రెస్ చేసిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Malavika Mohanan: ఆ టీమిండియా స్టారే నా ఫేవరెట్.. ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్
Malavika Mohanan

మన దేశంలో క్రికెటర్లకు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఏం చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్, బిజినెస్‌మెన్ వరకు అంతా క్రికెటర్లను ఇష్టపడుతుంటారు. టీమిండియాను గెలిపించడం కోసం పరితపించే తీరుకు ఇంప్రస్ అవుతుంటారు. అలాంటి ఓ భారత స్టార్‌కు ప్రభాస్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఫిదా అయిపోయింది. మరి.. ఆమెకు అంతగా నచ్చిన ఆ క్రికెటర్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


కింగ్ గేమ్‌కు ఫిదా

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ మాళవికా మోహనన్‌కు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమట. అతడే ఆమె ఫేవరెట్ క్రికెటరట. ఈ విషయాన్ని స్వయంగా మాళవికే తెలిపింది. సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్షన్ సమయంలో వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ వచ్చింది. ఈ తరుణంలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరని అడగ్గానే.. ఠక్కున విరాట్ కోహ్లీ అని చెప్పేసింది. ఇది చూసిన కింగ్ ఫ్యాన్స్.. విరాట్ ఆటకు అందరూ ఫిదా అవ్వాల్సిందేనని.. ఆయన ఫ్యాన్స్ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ చేరిందని అంటున్నారు.


ఫుల్ బిజీ

నిన్న మొన్నటి వరకు తమిళనాట మాత్రమే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన మాళవిక ఇప్పుడు తన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సూపర్ హిట్ అయితే ఆమె పాన్ ఇండియా డ్రీమ్స్ నెరవేరినట్లే. కాగా, అటు చాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్-2025 మీద ఫోకస్ చేస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో దుమ్మురేపాలని.. ఆర్సీబీకి ఈసారి కప్పు అందించాలనే కసితో కనిపిస్తున్నాడు. అతడు గానీ చెలరేగితే ఏదైనా సాధ్యమే.


ఇవీ చదవండి:

పంత్-రైనాతో కలసి ధోని మాస్ డ్యాన్స్

మూర్ఖుల మాటల్ని పట్టించుకోవద్దు: జావేద్‌ అక్తర్‌

భారత్‌ దూరం.. లార్డ్స్‌కు నష్టం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 12:35 PM