Virat Kohli On His Retirement: గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఈ లాజిక్ మామూలుగా లేదుగా!
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:46 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్‌పై ఎట్టకేలకు స్పందించాడు. క్రికెట్ నుంచి వైదొలగడానికి తన గడ్డానికి లింక్ పెట్టాడీ స్టార్ క్రికెటర్. ఇంతకీ కింగ్ ఏమన్నాడంటే..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. పొట్టి ప్రపంచ కప్-2024 సమయంలో టీ20లకు రిటైర్‌మెంట్ ఇచ్చేసిన కింగ్.. ఆ తర్వాత నుంచి వన్డేలు, టెస్టుల్లో ఆడుతూ వచ్చాడు. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌కూ దూరమయ్యాడు. ఇకపై 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే అతడి ఆటను ఆస్వాదించాల్సిన పరిస్థితి. అయితే టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చి చాన్నాళ్లు అవుతున్నా ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు విరాట్. తొలిసారి ఈ విషయంపై అతడు నోరు విప్పాడు. రిటైర్‌మెంట్‌కు గడ్డంతో ముడిపెట్టాడు కింద్. ఇంతకీ అతడేం అన్నాడంటే..
టైమ్ అయిపోయింది..
రెండ్రోజుల కిందే నెరిసిన గడ్డానికి రంగు వేసుకున్నానని కోహ్లీ అన్నాడు. ప్రతి 4 రోజులకు ఒకసారి గడ్డానికి కలర్ వేసుకుంటున్నామంటే మన టైమ్ అయిపోయిందని అర్థం చేసుకోవాలన్నాడు విరాట్. దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ లండన్‌లో నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి హాజరైన కోహ్లీ.. రిటైర్‌మెంట్ నిర్ణయంలో తన వయసును ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నానని చెప్పాడు. అయితే వయసు మీద పడుతోందనే అంశాన్ని నేరుగా చెప్పకుండా గడ్డానికి రంగు వేసుకుంటున్నానంటూ జోక్ చేశాడు విరాట్.
యువీ కోసమే..
యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌తో కలసి ఆడిన రోజుల్ని గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంలో వీళ్లంతా సాయపడ్డారని తెలిపాడు. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా తాము చాలా క్లోజ్‌గా ఉంటామని పేర్కొన్నాడు. టీమిండియాకు వచ్చిన కొత్తలో కాస్త భయం, బెరుకు ఉండేవని.. అయితే యువీ, జహీర్, భజ్జీ తనకు అండగా నిలిచారన్నాడు. యువరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన్ను ఎంతో గౌరవిస్తానని తెలిపాడు. యువీ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని.. మరొకరు పిలిస్తే వెళ్లేవాడ్ని కాదన్నాడు విరాట్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి