Share News

Virat Kohli IPL 2025: కోహ్లీ సక్సెస్ వెనుక హనుమయ్య.. అంతా తానై నడిపిస్తున్నాడుగా..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:18 PM

Indian Premier League: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ నయా ఎడిషన్‌లో ఈ సీనియర్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే అతడి సక్సెస్ వెనుక ఓ సూపర్ పవర్ ఉందనే విషయం తాజాగా బయటపడింది. ఆ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli IPL 2025: కోహ్లీ సక్సెస్ వెనుక హనుమయ్య.. అంతా తానై నడిపిస్తున్నాడుగా..
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అందుకున్న రిథమ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఫస్ట్ ట్రోఫీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీరని కోరిక తీర్చాలని పట్టుదలతో ఉన్నాడు విరాట్. అందుకే ఆర్సీబీకి అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో 2వ ప్లేస్‌లో ఉన్నాడు కింగ్. బ్యాట్‌తో కాంట్రిబ్యూట్ చేస్తూనే కొత్త సారథి రజత్ పాటిదార్‌కు వెన్నంటే ఉంటూ అతడి మీద కెప్టెన్సీ ప్రెజర్ పడకుండా చూసుకుంటున్నాడు. అయితే కోహ్లీ ఇంతగా సక్సెస్ అవడం వెనుక హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


కోహ్లీ బ్యాగ్‌పై..

గ్రౌండ్‌లోకి దిగితే ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించే కోహ్లీలో ఆధ్మాత్మిక, భక్తి భావనలు కూడా ఎక్కువే. అందుకే అతడు తరచూ ఆలయాలను సందర్శిస్తుంటాడు. సతీమణి అనుష్క శర్మతో కలసి ఎక్కువగా శివాలయాలకు వెళ్తుంటాడు కోహ్లీ. ఆ మధ్య బృందావన్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని కూడా సందర్శించాడు విరాట్. అలాంటోడి బ్యాగ్‌పై తాజాగా ఓ హనుమాన్ కీచైన్ కనిపించింది. చేతిలో గద పట్టుకొని నిలబడి ఉన్న ఆంజనేయుడ్ని ఈ ఫొటోలో చూడొచ్చు. కోహ్లీ బ్యాగ్‌పై ఉన్న ఈ కీచైన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. శివుడితో పాటు హనుమయ్య అంటే కూడా విరాట్‌కు ఎనలేని భక్తి అని అంటున్నారు. అందుకే అతడి బర్త్‌డే నాడు చాలా మంది ఫ్యాన్స్ ఆంజనేయుడి ఫొటోలను కింగ్‌కు బహూకరించారని గుర్తుచేస్తున్నారు. హనుమంతుడి ఆశీస్సులు ఉండటం వల్లే కోహ్లీ ఎదురులేకుండా దూసుకెళ్తున్నాడని.. ఆయనే అతడ్ని నడిపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు మిస్

పాక్‌తో క్రికెట్.. దాదా సెన్సేషనల్ కామెంట్స్

చెన్నై బ్యాటర్లపై ధోనీ అసంతృప్తి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 26 , 2025 | 03:27 PM