Share News

Kuldeep-Kohli: కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:24 PM

Virat Kohli: స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ తిట్లు తిన్నాడు. అదీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల్లోనే కావడం గమనార్హం. అసలు చైనామన్ బౌలర్‌పై కింగ్ ఎందుకు సీరియస్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం..

Kuldeep-Kohli: కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..
IND vs NZ

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి కల నెరవేర్చుకున్నాడు. ఐసీసీ ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లో భాగమవ్వాలని అనుకున్న చైనామన్ బౌలర్.. ఏడాది గ్యాప్‌లో తన డ్రీమ్‌ను రెండోసారి నిజం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 గెలిచిన భారత జట్టులో భాగమైన కుల్దీప్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025ని కైవసం చేసుకున్న టీమిండియా తుదిజట్టులోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంత చేసినా అతడికి తిట్లు మాత్రం తప్పడం లేదు. అసలు కుల్దీప్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం..


త్రో అందుకోలేక..

చాంపియన్స్ ట్రోఫీ-2025లో కుల్దీప్ పెద్దగా రాణించలేదు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకొని టీమ్‌కు భారమయ్యాడు. అయినా అతడి టాలెంట్‌, అనుభవంపై నమ్మకం ఉంచిన రోహిత్.. కివీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆడించాడు. కసి మీదున్న కుల్దీప్.. టైటిల్ ఫైట్‌లో 2 కీలక వికెట్లతో చెలరేగాడు. అయితే ఎప్పటిలాగే ఫీల్డింగ్ మిస్టేక్స్‌తో మళ్లీ హిట్‌మ్యాన్‌కు దొరికిపోయాడు. తన బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వేసిన త్రోను అందుకోలేక తిట్లు తిన్నాడు.


ఆ మాత్రం తెలియదా..

కుల్దీప్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఆఫ్ సైడ్ కొట్టిన బంతిని కోహ్లీ వెంటనే అందుకున్నాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌కు విసిరాడు కింగ్. కానీ వికెట్లకు దూరంగా ఉన్న కుల్దీప్.. బంతిని అందుకోకుండా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాడు. అతడు గనుక స్టంప్స్ దగ్గరకు వచ్చి బాల్‌ను పిక్ చేసుకొని కొట్టేసి ఉంటే లాథమ్ రనౌట్ అయ్యేవాడు. కానీ కుల్దీప్ నిర్లక్ష్యంతో బతికిపోయాడు. ఇది చూసిన రోహిత్, కోహ్లీ సీరియస్ అయ్యారు.


ఎందుకు పట్టుకోలేదు..

బంతిని ఎందుకు పట్టుకోలేదంటూ కుల్దీప్‌ వైపు చూస్తూ విరాట్ ఏదో అన్నాడు. ఆ వీడియో చూస్తే బూతులు తిడుతున్నట్లే ఉందని నెటిజన్స్ అంటున్నారు. కుల్దీప్ తప్పిదం చూసిన గంభీర్ కూడా అలా మిస్ అయ్యిందేంటి అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. రోహిత్ అయితే ఏం చెప్పాలో తెలియక తల మీద చేతులు పెట్టుకొని సైలెంట్ అయిపోయాడు. కాగా, సెమీస్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ కుల్దీప్ ఇలాగే బంతిని అందుకోకుండా దూరం నుంచి తమాషా చూడటంతో రోహిత్-కోహ్లీ ఇద్దరూ బూతుల దండకం అందుకున్నారు. ఇకపోతే, మ్యాచ్ టైమ్‌లో తిట్టుకున్నా కప్పు గెలిచాక కుల్దీప్‌ను రోహిత్-విరాట్ హగ్ చేసుకున్నారు. అతడితో కలసి సంబురాలు చేసుకున్నారు.


ఇవీ చదవండి:

పాక్ కెప్టెన్ ఒళ్లు బలిసిన వ్యాఖ్యలు

ఆ ఒక్కడి వల్లే ఓడాం: కివీస్ కెప్టెన్

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: కోహ్లీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2025 | 03:31 PM