Share News

Vaibhav Suryavanshi New Goal: డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:39 PM

ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

Vaibhav Suryavanshi New Goal: డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!
Vaibhav Suryavanshi

14 ఏళ్ల వయసులోనే స్టార్‌డమ్ సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్.. ఐపీఎల్-2025తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ.. 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతర వేశాడు. అక్కడితో ఆగని వైభవ్.. ఇంగ్లండ్ టూర్‌లో భారత అండర్-19 జట్టుకు ఆడుతూ 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్యవంశీ.. 78 బంతుల్లో 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాంటోడు ప్రత్యర్థులకు మరోమారు హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే..

suryavanshi.jpg


గిల్ స్ఫూర్తితో..

యూత్ వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలవడంపై వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. రికార్డు సృష్టించినట్లు తనకు తెలియదని అన్నాడు. ‘నేను రికార్డు సృష్టించాననే విషయం నాకే తెలియదు. 100 మార్క్‌ను అందుకున్నాక మా టీమ్ మేనేజర్ అంకిత్ ఈ విషయం చెప్పారు. నెక్స్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టాలని అనుకుంటున్నా. తప్పకుండా 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి 200 మార్క్‌ను అందుకోవాలని భావిస్తున్నా. నేను ఎంత ఎక్కువగా పరుగులు చేస్తే అది టీమ్‌కు అంత మంచి చేస్తుంది’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ బ్యాటింగ్ అదిరిపోయిందని, అతడిలా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని అనుకుంటున్నానని తెలిపాడు. మరింత నిబద్ధత, క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించాడు.


ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 02:40 PM