Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన సూర్యవంశీ.. పిచ్చకొట్టుడు కొట్టాడు!
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:18 PM
టీమిండియా యువ తరంగం వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడు ఎన్ని పరుగులు చేశాడంటే..

భారత యువ తరంగం వైభవ్ సూర్యవంశీ మరోమారు రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ టీమ్‌ను ఓ ఆటాడుకున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. బౌండరీలు, సిక్సుల వర్షంలో ప్రత్యర్థి బౌలర్లను ముంచేశాడు. భారత అండర్-19 జట్టు-ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే ఏకంగా 48 పరుగులు బాదాడు. ఇందులో 3 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. సూర్యవంశీ బ్యాట్ నుంచి వచ్చిన 48 పరుగుల్లో బౌండరీలు, సిక్సుల ద్వారానే 42 పరుగులు రావడం విశేషం.
భారీ షాట్లతో..
సొంతగడ్డపై బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఊపిరి సలపకుండా చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఫోర్లు, సిక్సులతో ఆ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ కుందూ (45 నాటౌట్), కెప్టెన్ ఆయుష్ మాత్రే (21) రాణించడంతో ఆతిథ్య జట్టు విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది భారత్. మరో 26 ఓవర్లు ఉండగానే టార్గెట్‌ను ఊదిపారేసింది. వైభవ్ బ్యాటింగ్ అదిరిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని టీమిండియాలోకి తీసుకురావాలని.. సూర్యవంశీ జట్టుకు ప్రధాన అస్త్రంగా మారతాడని చెబుతున్నారు. మెన్ ఇన్ బ్లూకు ఇలాంటోడి అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో దుమ్మురేపాడు సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటర్.. 7 ఇన్నింగ్స్‌ల్లో 252 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లోనైతే 35 బంతుల్లోనే సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి