Vaibhav Suryavanshi: సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఈ రాక్షసుడ్ని ఆపడం అయ్యే పనికాదు!
ABN , Publish Date - Jun 08 , 2025 | 09:13 AM
యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్-2025లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైభవ్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఎన్‌సీఏ క్యాంప్‌లో అతడు విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో బౌలర్లను హడలెత్తించాడీ 14 ఏళ్ల బ్యాటర్. త్వరలో జరిగే ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధమవుతోంది భారత అండర్-19 టీమ్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ జట్టు క్యాంప్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న వైభవ్.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు.
దంచుడే దంచుడు..
గ్రౌండ్‌లోని నలువైపులా భారీ షాట్లు బాదుతూ బౌలర్లకు బంతులు వేయాలంటే వణికేలా చేశాడు సూర్యవంశీ. స్పిన్నర్లపై శివాలెత్తిన యువ బ్యాటర్.. పేసర్ల బౌలింగ్‌లోనూ క్రీజు విడిచి బిగ్ సిక్సులు కొట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో మోకాళ్లపై కూర్చొని బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. అతడి పవర్ హిట్టింగ్, బంతిని అంచనా వేసిన తీరు, బౌలర్ల పేస్‌ను వినియోగించుకున్న విధానం, షాట్ మేకింగ్, షాట్స్ రేంజ్.. ఇలా అంతా అదిరిపోయాయనే చెప్పాలి. సుదీర్ఘ అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరిగా బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడు సూర్యవంశీ. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడి బ్యాటింగ్‌ను మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. ఈ చిచ్చరపిడుగు జోరు మామూలుగా లేదుగా.. బౌలర్లకు నరకం చూపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే ఆడుతూ పోతే త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని చెబుతున్నారు. కాగా, గతేడాది అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన సూర్యవంశీ.. 5 ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసి ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి