AUS vs SA: బుద్ధి పోనిచ్చుకోని ఆసీస్.. కప్పు కోసం ఇంతగా దిగజారాలా?
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:20 PM
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ క్రికెట్‌లో దశాబ్దాలుగా పెత్తనం చలాయిస్తూ వస్తోంది ఆస్ట్రేలియా. 1990ల్లో కరీబియన్ల ఆధిపత్యం ముగిసినప్పటి నుంచి కంగారూలదే డామినేషన్. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఫార్మాట్ ఏదైనా ఆసీస్ బరిలోకి దిగితే కప్పు ఖాయం అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఆ జట్టు పెత్తనానికి చెక్ పెడుతూ వస్తున్నాయి. ఒకదాని తర్వాత మరో ఐసీసీ ట్రోఫీలు దూరమవుతుండటంతో ఆసీస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా వరల్డ్ టెస్ట్ సిరీస్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా మిస్ అవడంతో ఆ జట్టు ఆటగాళ్లు మరింత నిరాశకు గురయ్యారు. ఓటమి బాధను తట్టుకోలేకపోయారు. కప్పు చేజారుతుండటంతో ఓ చెత్త పని చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చోకర్స్ కాదు చాంపియన్స్..
సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో 5 వికెట్ల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది ఆస్ట్రేలియా. అయితే బుద్ధి మార్చుకోని కంగారూలు.. మ్యాచ్ చేజారుతున్నప్పుడు ప్రొటీస్ బ్యాటర్లను స్లెడ్జ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సఫారీ కెప్టెన్ తెంబా బవుమా బయటపెట్టాడు. ‘బ్యాటింగ్ సమయంలో చోకర్స్ అనే పదాన్ని పదే పదే విన్నాం. మేం విజయానికి దగ్గరవుతున్న కొద్దీ ఆసీస్ ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వాళ్ల నుంచి చోకర్స్ అనే పదం ఎక్కువగా వినిపించింది’ అని బవుమా చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాకు ఇక బుద్ధిరాదని.. ఓటమిని తట్టుకోలేకే ఇలాంటివి చేస్తుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చేతనైతే గెలిచి చూపించాలని, కప్పు కోసం ఇలా దిగజారడం ఏంటని చెబుతున్నారు. సఫారీలు చోకర్స్ కాదు.. రియల్ చాంపియన్స్ అని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
సౌతాఫ్రికాకు కప్పు.. భారత్‌లో సంబురాలు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి