IND vs ENG Challenge: 60 ఓవర్ల నరకం.. టీమిండియాకు ఒకే దారి!
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:17 PM
టీమిండియా ముందు బిగ్ చాలెంజ్ ఉంచింది ఇంగ్లండ్. ఈ సవాల్‌ను అధిగమిస్తే మ్యాచే కాదు.. సిరీస్ కూడా భారత్ వశమవుతుంది. మరి.. ఆ చాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

60 ఓవర్ల నరకం.. ఈ డైలాగ్‌ను టీమిండియా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంగ్లండ్‌కు పెట్టని కోటగా ఉన్న లార్డ్స్‌లో ఆ జట్టును భయపెట్టి ఓడించిన నినాదం అది. 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌లో ఆతిథ్య జట్టును 151 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. రాబోయే 60 ఓవర్లు ఇంగ్లండ్‌కు నరకం చూపిద్దాం అంటూ కోహ్లీ ఇచ్చిన స్లోగన్‌తో రెచ్చిపోయారు భారత బౌలర్లు, ఫీల్డర్లు. సిరాజ్ (3 వికెట్లు), బుమ్రా (4 వికెట్లు), ఇషాంత్ (2 వికెట్లు) చెలరేగి బౌలింగ్ చేశారు. ఒక్కో పరుగు తీయాలంటే వణికేలా చేశారు. ఆ చారిత్రక విజయం నుంచి గిల్ సేన స్ఫూర్తి పొందాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు అంటున్నారు.
భయపెడుతున్న స్లోప్..
5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో తలపడుతోంది భారత్. ఆట ఐదో రోజుకు చేరుకుంది. గెలుపు కోసం ఇంగ్లండ్‌కు 6 వికెట్లు కావాలి. అదే గిల్ సేన నెగ్గాలంటే ఇంకా 135 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కార్స్-కెప్టెన్ స్టోక్స్ భీకర ఫామ్‌లో కనిపిస్తున్నారు. దీనికి తోడు పిచ్‌లో ఉన్న స్లోప్ కారణంగా బంతి అనూహ్యంగా దిశ మార్చుకొని బ్యాటర్ల వైపు ఊహించిన దాని కంటే వేగంగా, సుడులు తిరుగుతూ వస్తోంది. దీంతో అప్పటి కోహ్లీ సేన గెలుపు నుంచి స్ఫూర్తి పొందాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కనీసం 40 ఓవర్లు బ్యాటింగ్ చేసినా విజయం మనదేనని చెబుతున్నారు.
ఒకటిన్నర సెషన్‌లోనే..
బంతి ఇంకా పాతబడలేదు కాబట్టి తొలి 10 ఓవర్లు రక్షణాత్మక ధోరణిలో ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బాల్ ఓల్డ్ అవుతున్న కొద్దీ బ్యాట్ మీదకు ఈజీగా వస్తుంది కాబట్టి అలవోకగా పరుగులు చేయొచ్చని చెబుతున్నారు. బంతి మెత్తబడే దాకా డిఫెన్సివ్ అప్రోచ్‌తో ముందుకెళ్లడం బెటర్ అని.. ఆ తర్వాత అటాక్ చేయొచ్చని అంటున్నారు. 40 ఓవర్లు ఒకవైపు డిఫెన్స్, మరోవైపు అటాక్‌తో ఇంగ్లండ్‌కు నరకం చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకటిన్నర సెషన్‌లో స్టోక్స్ సేన ఆట కట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన సుందర్!
పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి