Share News

Suryakumar Yadav: ఐపీఎల్ ముగిసినా ఆగని సూర్యకుమార్.. ఊచకోత కోస్తున్నాడు!

ABN , Publish Date - Jun 06 , 2025 | 09:17 AM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తగ్గేదేలే అని అంటున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా సూర్య భాయ్ జోరు మాత్రం తగ్గడం లేదు. బౌలర్లను ఊచకోత కోస్తున్నాడీ మాస్ బ్యాటర్.

Suryakumar Yadav: ఐపీఎల్ ముగిసినా ఆగని సూర్యకుమార్.. ఊచకోత కోస్తున్నాడు!
Suryakumar Yadav

ఐపీఎల్-2025 ముగియడంతో ఆటగాళ్లంతా తదుపరి సిరీస్‌ల మీద దృష్టి సారిస్తున్నారు. కొందరు ఇంటర్నేషనల్ మ్యాచులతో బిజీ అయిపోతే.. మరికొందరు దేశవాళీ టోర్నీల కోసం సన్నద్ధం అవుతున్నారు. భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. టీ20 ముంబై లీగ్-2025లో ట్రయంఫ్ నైట్స్ తరఫున రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు సూర్య భాయ్. క్యాష్ రిచ్ లీగ్ ఫామ్‌నే కొనసాగిస్తూ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌తో గురువారం జరిగిన పోరులో 31 బంతుల్లో 42 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు మిస్టర్ 360. ఇందులో 2 బౌండరీలు, 3 భారీ సిక్సులు ఉన్నాయి.


ఇదేం బాదుడు..

ఐపీఎల్‌లో ఎక్కడ ముగించాడో టీ20 ముంబై లీగ్‌లో అక్కడే ఊపందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. వరుసగా సునామీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. మొత్తంగా గత 18 టీ20 ఇన్నింగ్స్‌లు చూసుకుంటే.. 29 (26), 48 (28), 27 నాటౌట్ (9), 67 (43), 28 (26), 40 (28), 26 (15), 68 నాటౌట్ (30), 40 నాటౌట్ (19), 54 (28), 48 నాటౌట్ (23), 35 (24), 73 నాటౌట్ (43), 57(39), 33(20), 44(26), 50 నాటౌట్ (27), 42(31).. ఇవీ స్కై బాదిన స్కోర్లు. దీన్ని బట్టే అతడు ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. భారత టీ20 జట్టుకు ఇది సూపర్ న్యూస్ అని అంటున్నారు. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెనే ఈ స్థాయిలో రాణిస్తే ఇక జట్టుకు తిరుగుండదని చెబుతున్నారు. సూర్య.. నీ బ్యాటింగ్‌కు సలామ్ అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కోహ్లీ 18 కానీ సచిన్‌ 22

పోలీసులు వద్దన్నా ససేమిరా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 10:32 AM