Steve Smith: టీమిండియా చేతిలో ఓటమి.. ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:22 PM
IND vs AUS: ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాకౌట్ ఫైట్‌లో భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన స్మిత్.. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. అతడి డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడీ మోడర్న్ మాస్టర్. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం భారత్‌తో జరిగిన సెమీపైనల్‌లో ఆసీస్ ఓటమిపాలైంది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన కంగారూలు.. 4 వికెట్ల తేడాతో మట్టికరిచారు. ఈ ఓటమి నేపథ్యంలో వన్డేల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు స్మిత్. ఆల్రెడీ టీమ్ ఫైనల్స్‌కు వెళ్లకపోవడంతో బాధలో ఉన్న ఫ్యాన్స్‌కు స్మిత్ రిటైర్మెంట్ వార్త మరింత నిరాశకు గురిచేస్తుందని చెప్పొచ్చు.
సుదీర్ఘ కెరీర్
వన్డే క్రికెట్‌లోకి స్మిత్ ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దంన్నర కావొస్తోంది. 2010, ఫిబ్రవరి 19వ తేదీన మెల్‌బోర్న్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు స్మిత్. మొదట్లో లెగ్ స్పిన్నర్‌గా ఆడుతూ వచ్చిన ఈ దిగ్గజం.. ఆ తర్వాత బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపర్చుకొని క్రమంగా బ్యాటర్‌గా ఫిక్స్ అయిపోయాడు. ఒక్కో సిరీస్‌లో రాణిస్తూ ఆ టీమ్ బ్యాటింగ్‌కు మూలస్తంభంగా ఎదిగాడు. వన్డే క్రికెట్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశాడు స్మిత్. సారథిగానూ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నా కెరీర్ ఆఖరుకు చేరుకోవడం, టెస్టులపై ఫుల్ ఫోకస్ చేయాలనుకోవడం, జట్టులో ఉన్న పోటీ, కెప్టెన్‌గా కప్పు అందించలేకపోయాననే బాధతో అతడు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. వన్డేల్లో ఓవరాల్‌గా 170 మ్యాచులు ఆడిన స్మిత్.. 5800 పరుగులు చేశాడు. 164 అతడి హయ్యెస్ట్ స్కోరు. అతడి ఖాతాలో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 28 వికెట్లు పడగొట్టాడు స్మిత్. ఇక, సుదీర్ఘ అనుభవం, కెప్టెన్‌గానూ రాణించిన అతడి స్థానాన్ని భర్తీ చేయడం ఆస్ట్రేలియాకు అంత ఈజీ కాదనే చెప్పాలి.
ఇవీ చదవండి:
కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం
ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు: రాహుల్
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి