SRH vs MI Prediction: సన్‌రైజర్స్‌కు లాస్ట్ చాన్స్.. దుమ్మురేపుతారా.. దొరికిపోతారా..
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:07 PM
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్‌లో ఇవాళ టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ఐపీఎల్ తాజా ఎడిషన్‌ను ఫేవరెట్స్‌గా స్టార్ట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండో మ్యాచ్ నుంచే డీలా పడింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ తప్పక నెగ్గాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది ఎస్‌ఆర్‌హెచ్. అందుకోసం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌నే వేదికగా చేసుకోవాలని భావిస్తోంది కమిన్స్ సేన. సొంతగడ్డ ఉప్పల్ వేదికగా ఎంఐతో ఇవాళ జరిగే పోరులో నెగ్గి కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకోవాలని చూస్తోంది ఆరెంజ్ ఆర్మీ. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బలాలు
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. క్లాసెన్, హెడ్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. వీళ్లు పూర్తి ఫామ్‌ను అందుకుంటే టీమ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్ కాక మీదున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో అతడు 3 వికెట్లు పడగొట్టాడు. ఎషాన్ మలింగ, హర్షల్ పటేల్ కూడా అవసరమైనప్పుడు బ్రేక్‌త్రూలు అందిస్తున్నారు.
ముంబై: బ్యాటింగ్ యూనిట్ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా.. ఇలా అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్ కూడా అడపాదడపా రాణిస్తున్నారు. కెప్టెన్ పాండ్యా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు.
బలహీనతలు
సన్‌రైజర్స్: ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని తెగ ఇబ్బంది పెడుతోంది. హెడ్, క్లాసెన్ ఆశించినంత వేగంగా పరుగులు చేయడం లేదు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు బోల్తా పడుతున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ షమి, జీషన్ అన్సారీ వికెట్లు తీయలేక, పరుగులు లీక్ చేస్తూ టీమ్‌కు భారంగా మారారు.
ముంబై: రికల్టన్ మంచి స్టార్ట్స్ అందిస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఫామ్‌లోకి వచ్చిన రోహిత్.. దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి. విల్ జాక్స్ బంతితో రాణిస్తున్నా బ్యాట్‌తో మెరవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో అశ్వనీ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
గత రికార్డులు
ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 24 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచుల్లో సన్‌రైజర్స్, 14 మ్యాచుల్లో ముంబై విజయం సాధించాయి.
విన్నింగ్ ప్రిడిక్షన్
బ్యాటర్ల ఫామ్, బౌలింగ్ పవర్, గత రికార్డులు, టీమ్ బ్యాలెన్స్.. ఇలా అన్నింటా సన్‌రైజర్స్ కంటే ముంబై పటిష్టంగా ఉంది. కాబట్టి ఇవాళ్టి పోరులో హార్దిక్ సేన విజయం ఖాయం.
ఇవీ చదవండి:
న్యాయం జరగాల్సిందే.. స్టార్ల డిమాండ్
పెళ్లి కాని మిశ్రా భార్యను వేధించాడట
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి