SRH vs MI Ishan Kishan: ఔట్ కాకున్నా గ్రౌండ్‌ను వీడిన ఇషాన్.. ఇలా తయారయ్యారేంట్రా..
ABN , Publish Date - Apr 23 , 2025 | 08:18 PM
Indian Premier League: సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన పనికి ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇలా చేశాడేంట్రా బాబు అంటూ తల బాదుకుంటున్నారు. మరి.. ఇషాన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ అసలే వరుస ఓటములతో తాజా ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కూడా టీమ్‌కు కీలకంగా మారింది. అటు ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా ఫామ్‌లో లేడు. పరుగులు చేయాలంటే ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ తన వికెట్‌ను అపోజిషన్ టీమ్‌కు అప్పనంగా ఇచ్చేశాడు. తీసుకోండి అంటూ గిఫ్ట్‌గా చేతుల్లో పెట్టాడు. అతడు మరెవరో కాదు.. యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్. అతడు చేసిన పనికి ఆరెంజ్ ఆర్మీ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా తల బాదుకుంటున్నారు. ఇంతకీ ఇషాన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
అల్ట్రా ఎడ్జ్‌తో ఫుల్ క్లారిటీ
ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అప్పనంగా వికెట్ ఇచ్చేశాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పడిన బంతిని ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు సన్‌రైజర్స్ బ్యాటర్. అయితే బాల్ అతడి బ్యాట్‌కు తగల్లేదు. కానీ ఎడ్జ్ తీసుకున్నట్లు అనిపించింది. దీంతో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయకపోయినా అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. అయితే తాను క్లియర్ ఔట్ అని భావించిన ఇషాన్.. రివ్యూ తీసుకోకుండానే క్రీజును వీడాడు. ప్రత్యర్థి ప్లేయర్లు అప్పీల్ చేయకపోయినా అతడు పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లడంతో వాళ్లు అతడి క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత రీప్లేలో ఇషాన్ నాటౌట్ అని తేలింది. బాల్ అతడి బ్యాట్‌కు తగల్లేదని అల్ట్రా ఎడ్జ్‌లో క్లారిటీగా కనిపించింది. దీంతో ఇషాన్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేశాడు.. ఇలా తయారయ్యారేంటి.. అసలు ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏమైందని వాపోతున్నారు.
ఇవీ చదవండి:
పహల్గాం అటాక్.. హార్దిక్ సీరియస్..
సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్
న్యాయం జరగాల్సిందే.. స్టార్ల డిమాండ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి