SRH IPL 2025: విధి రాత.. సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..
ABN , Publish Date - May 06 , 2025 | 08:58 AM
Sunrisers Hyderabad: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటకు వచ్చేసింది. మరో 3 మ్యాచులు ఆడాల్సి ఉన్నా.. ఎస్‌ఆర్‌హెచ్ అప్పుడే ఇంటిదారి పట్టింది. ఇక కమిన్స్ సేన ఆడబోయే మిగిలిన మ్యాచులు నామమాత్రం కానున్నాయి.

ఐపీఎల్-2025 నుంచి మరో జట్టు బయటకు వచ్చేసింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇంటిదారి పట్టగా.. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ రద్దవడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది కమిన్స్ సేన. దీంతో గతేడాది రన్నరప్‌గా నిలవడమే గాక అటాకింగ్ గేమ్‌తో అందర్నీ భయపెట్టిన ఎస్ఆర్‌హెచ్.. ఒక్క సీజన్ గ్యాప్‌లో ఇలా పతనమవడం ఏంటనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ వైఫల్యానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అటాకింగ్ అప్రోచ్
అగ్రెసివ్ అప్రోచ్‌కు మారుపేరుగా మారిన సన్‌రైజర్స్.. లాస్ట్ సీజన్‌లో ధనాధన్ స్టైల్‌లో ఆడుతూ సక్సెస్ అయింది. అయితే ఈసారి అదే ఆ టీమ్ కొంపముంచింది. పిచ్, కండీషన్స్, సిచ్యువేషన్‌ను పట్టించుకోకుండా హెడ్, అభిషేక్, ఇషాన్, నితీష్ లాంటి బ్యాటర్లంతా అగ్రెసివ్‌గా ఆడేందుకు వెళ్లి చాలా మ్యాచుల్లో వికెట్లు పారేసుకున్నారు. అగ్రెసివ్ అప్రోచ్ అనే ఫార్ములాతో ఇతర టీమ్స్‌ను కొట్టేద్దామనుకున్న ఆరెంజ్ ఆర్మీ.. అనవసర దూకుడు కారణంగా తాను తీసిన గోతిలో తానే పడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేలవ బౌలింగ్
ఈ సీజన్‌లో టీమ్‌కు బౌలింగ్ బిగ్ మైనస్‌గా మారింది. మహ్మద్ షమి ఫ్లాప్ అవడం టీమ్ విజయావకాశాల మీద భారీ ప్రభావం చూపింది. హర్షల్ పటేల్-కెప్టెన్ కమిన్స్ రాణించినా అంచనాలను అందుకోలేకపోయారు. కమిన్స్ అటు కెప్టెన్సీలో డిఫెన్సివ్ అప్రోచ్‌తో విఫలమవడమే గాక బౌలింగ్ చేంజెస్‌లోనూ తప్పుల మీద తప్పులు చేస్తూ అవతలి జట్లకు అనవసర ఎడ్జ్ ఇవ్వడం సన్‌రైజర్స్ పాలిట శాపంగా మారింది.
బ్యాటింగ్ డెప్త్
అభిషేక్, హెడ్, ఇషాన్, నితీష్, క్లాసెన్.. ఇలా టాప్ బ్యాటర్లతో ఎస్‌ఆర్‌హెచ్ లైనప్ దుర్భేద్యంగా కనిపించింది. కానీ చాలా మ్యాచుల్లో టాప్-4 విఫలమవడంతో భారం మొత్తం మిడిలార్డర్‌పై పడింది. కానీ అభివన్ మనోహర్, అనికేత్ వర్మ లాంటి యంగ్‌స్టర్స్‌తో కూడిన మిడిలార్డర్ కొన్ని మ్యాచుల్లో విజయవంతమైనా.. ఎక్కువ మటుకు సక్సెస్ కాలేకపోయింది. మిడిలార్డర్‌లో మరింత అనుభవం, పవర్ హిట్టింగ్ కలిగిన ఇద్దరు ఫినిషర్లు ఉండుంటే ఇంకా బాగుండేది. ఈ సామర్థ్యం లేకపోవడం వల్లే టాపార్డర్ ఫెయిలైన మ్యాచుల్లో టీమ్ తక్కువ స్కోర్లకే కుప్పకూలింది.
పిచ్ ఫియర్
ఫ్లాట్ పిచ్‌లపై అదరగొట్టే సన్‌రైజర్స్ సీక్రెట్‌ను అవతటి జట్లు పసిగట్టాయి. అందుకే బయటి మ్యాచుల్లో కమిన్స్ సేన కోసం స్లో, బౌలింగ్ ట్రాక్స్‌ను సిద్ధం చేసి విజయం సాధించాయి. హోం గ్రౌండ్ ఉప్పల్‌లోనూ సీజన్ ఆఖర్లో స్లో వికెట్లను రెడీ చేయడం కూడా టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది.
స్ట్రాటజీలు మిస్
ఈసారి సన్‌రైజర్స్ స్ట్రాటజీలు పూర్తిగా బెడిసికొట్టాయి. హెడ్, అభిషేక్, నితీష్, ఇషాన్.. ఇలా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల వీక్‌నెస్‌లను బట్టి ప్రత్యర్థి జట్లు గట్టి ప్లానింగ్‌తో వరుసగా దాడులు చేసి సక్సెస్ అయ్యాయి. అయినా కమిన్స్-వెటోరి ఏమీ చేయలేకపోయారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో వీళ్ల ఎత్తులు అస్సలు పారలేదు. కొందరు స్టార్లపై అతిగా ఆధార పడటం, మ్యాచ్ సిచ్యువేషన్స్‌ను బట్టి వ్యూహాలు మార్చకపోవడం, కమిన్స్ కెప్టెన్సీ లోపాలు లాంటివి కూడా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ వైఫల్యానికి కారణాలుగా చెప్పొచ్చు.
ఇవీ చదవండి:
ఇండియన్ ఐడల్ నుంచి ఐపీఎల్‌కు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి