Share News

Daniel Vettori On SRH: కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు తగ్గాడు అంటున్న కోచ్ వెటోరి

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:33 PM

Sunrisers Hyderabad: సన్‌‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గాడిన పడింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కమిన్స్ సేన.. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్‌పై విక్టరీతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Daniel Vettori On SRH: కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు తగ్గాడు అంటున్న కోచ్ వెటోరి
Sunrisers Hyderabad

ఐపీఎల్-2025లో గెలవడమే మర్చిపోయినట్లు ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గాడిన పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో నెగ్గింది కమిన్స్ సేన. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకడమే గాక ప్లేఆఫ్స్ రేసులో ఉన్నానంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, నితీష్ రెడ్డి లాంటి యంగ్‌స్టర్స్ అదరగొట్టారు. దీంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఇంత మంది ప్లేయర్లు రాణిస్తున్నా ఆ ఒక్కడ్ని మిస్ అవుతున్నామని అంటున్నాడు టీమ్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి. మరి.. కాటేరమ్మ కొడుకుల్లో మిస్ అయిన ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


లెక్క మరోలా ఉండేది..

లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్‌ను మిస్ అవుతున్నామని అన్నాడు వెటోరి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొడుతున్న ఈ స్పిన్నర్‌ను మెగా ఆక్షన్‌లో దక్కించుకోనందుకు బాధగా ఉందన్నాడు. అతడు టీమ్‌లో ఉంటే లెక్క మరోలా ఉండేదన్నాడు ఎస్‌ఆర్‌హెచ్ కోచ్. ముంబై ఇండియన్స్‌కు మిచెల్ శాంట్నర్, సీఎస్‌కేకు రవీంద్ర జడేజా, పంజాబ్ కింగ్స్‌కు హర్‌ప్రీత్ బ్రార్ రూపంలో మంచి క్వాలిటీ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఉన్నారని.. దీంతో సాయి కిషోర్‌ను సన్‌రైజర్స్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని వెటోరి చెప్పుకొచ్చాడు. అతడు సూపర్బ్ బౌలర్ అని మెచ్చుకున్నాడు.


అలాంటోడు టీమ్‌లో ఉంటే..

లిమిటెడ్ ఓవర్స్‌కు తగ్గట్లు టైట్‌గా బౌలింగ్ చేయడం, బంతిని షార్ప్‌గా టర్న్ చేయడం, మంచి లెంగ్త్స్‌లో బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సాయి కిషోర్ బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు వెటోరి. అతడి కోసం ఆక్షన్‌లో తీవ్రంగా ప్రయత్నించామని, కానీ రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడి రూ.2 కోట్ల ధరకు గుజరాత్ రీటెయిన్ చేసుకుందని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 12 వికెట్లతో జీటీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాడు సాయి కిషోర్. ఇది చూసిన నెటిజన్స్.. సాయి కిషోర్ ఉంటే సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్ దుర్భేద్యంగా మారేదని.. నిఖార్సయిన లెఫ్టార్మ్ స్పిన్నర్ లేని లోటు టీమ్‌లో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఆ ఒక్కడూ ఆరెంజ్ ఆర్మీలో జాయిన్ అయితే కాటేరమ్మ కొడుకులకు ఎదురుండేది కాదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

పాక్‌తో క్రికెట్.. దాదా సెన్సేషనల్ కామెంట్స్

చెన్నై బ్యాటర్లపై ధోనీ అసంతృప్తి

అమ్మపైనా విమర్శలా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 26 , 2025 | 02:39 PM